హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. ఉగాది పండుగ రోజున కొన్ని తప్పులు చేయడం వల్ల తీవ్రస్థాయిలో నష్టపోవాల్సి ఉంటుంది. ఈ పండుగ రోజున అప్పులు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు. ఒకవేళ ఆ విధంగా చేస్తే ఏడాదంతా అప్పులపై ఆధారపడాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈరోజు కోపం వచ్చినా కంట్రోల్ లో ఉండటానికి ప్రయత్నించాలి.
 
ఇతరులతో వాదించటానికి, గొడవ పడటానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈరోజు కుటుంబ సభ్యుల విషయంలో ప్రేమగా వ్యవహరించాలి. ఈరోజు బాధ పడటం లేదా బాధ పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈరోజు నూతన వస్త్రాలు ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈరోజు కొత్త వస్త్రాలు కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
 
ఈరోజు తల స్నానం మాత్రమే చేయడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పాలి. ఉగాది రోజుల దేవుళ్లను పూజించే సమయంలో, పూజించిన తర్వాత బొట్టు కచ్చితంగా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు దానధర్మాలు చేయడం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఈరోజు బ్రహ్మ సరస్వతిలను పూజించాలి. సమీపంలోని దేవాలయాలకు వెళ్లి పంచాంగ శ్రవణం వినాలి.
 
ఈరోజు శరీరానికి నువ్వుల నూనెతో మర్ధనా చేసి అభ్యంగన స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సున్నిపిండితో స్నానం చేయడం వల్ల శరీరంలోని మృత కణాలు తొలగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఉగాది పండుగ ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతే బాగుంటుందని చెప్పవచ్చు. ఉగాది రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తే మంచిది. ఈరోజు ఉగాది పచ్చడి చేసుకుని తినడం ద్వారా మంచి జరుగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. నిర్దేశిత సమయాల్లో మాత్రమే ఉగాది పచ్చడిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఉగాది రోజున సంతోషంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలి.








మరింత సమాచారం తెలుసుకోండి: