
ఈ సందర్భంగా.. సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉగాది రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ఆ తర్వాత అన్ని జిల్లాలలో మంత్రుల చేతుల మీదుగా... ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యం పంపిణీ షురూ అవుతుంది.
సన్న బియ్యం తో పాటు... మరో శుభవార్త కూడా తెల్ల రేషన్ కార్డుదారులకు చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అతి త్వరలోనే రేషన్ షాపుల్లోనే నిత్యవసర సరుకులు కూడా ఇస్తామని ప్రకటన చేసింది. దీంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే 6 గ్యారంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.... ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అధికారంలోకి రాగానే మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక అదే సమయంలో... రైతు బీమా అలాగే రైతు బంధు పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇటీవల రుణమాఫీ కూడా చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే తాజాగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ షాపుల్లోకి... సన్న బియ్యం వెళ్ళాయి.