
పైగా.. ప్రభుత్వంలో కీలక శాఖ మంత్రిగా కూడా నిమ్మల వ్యవహరిస్తున్నారు. కానీ, నిమ్మల ఎప్పుడూ అలా ఆడంబరాలకు, డాంబికాలకు పోలేదు. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన తాను.. ప్రజల కోసమే పనిచేస్తాను అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంజాన్‌ను పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందులు ఇచ్చారు. ఈ క్రమంలో పాలకొల్లులోనూ.. మంత్రి నిమ్మల ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. అయితే.. అందరిలా ఆయన వ్యవహరించలేదు.
ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్నప్పటికీ.. నిమ్మల ఒక్కరూపాయి కూడా తీసుకోకుండానే.. ఇఫ్తార్ విందు ఇచ్చారు. సొంతగాతన జేబు నుంచి ఖర్చుచేశారు. అంతేకాదు.. ఆయన చేసిన మరో ఆశ్చర్యకరమైన పని.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తోంది. రంజాన్ ఇఫ్తార్ విందులో రామానాయుడు ప్రత్యేకత చాటుకున్నారు. మంత్రిగా ఉన్నత స్థానానికి ఎదిగినప్పటికీ సేవ భావాలను కొనసాగిస్తూనే ఉన్నారు. రంజాన్ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో ముస్లింలతో కలిసి ప్రార్థన చేయడం శుభాకాంక్షలు తెలపడం అనంతరం ఇఫ్తార్ విందులో వారందరికీ తానే స్వయంగా వడ్డించడం గమనార్హం.
అంతేకాదు.. అందరూ తిన్న తర్వాత ఆకులను ,పళ్లాలను స్వయంగా తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన స్వయంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని సంప్రదాయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అందరిని పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవడం ద్వారా వారిలో తాను ఒకడిగా ఆయన కలిసిపోతారు. ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరికి మంత్రి రామానాయుడు స్వయంగా వడ్డించారు. రంజాన్ మాసంలో ముస్లింలతో ప్రతి సంవత్సరం గడపడం తనకు సంతోషాన్ని ఆనందం ఇస్తుందని ముఖ్యంగా తన కుటుంబ సభ్యులతో గడిపినట్లుగా ఉంటుందని మంత్రి రామానాయుడు పేర్కొనడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం.