ఆంధ్రప్రదేశ్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు టిడిపి పార్టీకే ఒక మేకుల మారిపోతున్నారు.. 20204 ఎన్నికలలో ఈయన పేరు బాగానే వినిపించిన అయితే ఎన్నికలు అయిపోయి ఎమ్మెల్యేగా గెలిచి.. టిడిపి పార్టీని ఒక వైపు నుంచి గెలుకుతూనే ఉన్నారు. తనదైన స్టైల్ లో అప్పుడప్పుడు ఒక జలక్ కూడా ఇస్తూ ఉంటారు ఈ కొలికపూడి ఎమ్మెల్యే. ప్రస్తుతం టిడిపి పార్టీలో ఈయన ఇమడడం లేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన నియోజకవర్గంలో రమేష్ రెడ్డి అనే ఒక నాయకుడు పైన కూడా హై కమాండ్ యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా ఒక డెడ్లైన్ ని విధించి మరి ఏపీ అంతట ఒక సంచలనంగా మారారు కొలికపూడి.



అయితే ఇప్పుడు తాజాగా చూస్తే కొలకపూడి మరింత సంచలనానికి తెర తీసేలా మాట్లాడారు.. ఏకంగా టిడిపి హై కమాండ్ కి ఈ బాణం గుచ్చుకునేలా హాట్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.. ప్రజలు కూటమికి ఓట్లు వేసింది జగన్ కంటే మంచి పాలన అందించాలని అంతేకానీ ప్రతిరోజు జగన్ ని తిట్టమని ఓట్లు ప్రజలు మనకి వేయలేదంటూ గట్టిగానే కౌంటర్ వేశారు. దీంతో పాలన పైన దృష్టి పెట్టకుండా చేస్తున్న అటు ఎమ్మెల్యేలను , మంత్రులను, అటు నేతలకు సైతం ఇది గట్టి కౌంటర్ అందినట్లుగా కొలికపూడి చెప్పేసారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.



కేవలం జగన్ విషయంలో ఎలాంటి విషయం జరిగిన కూడా అది వైసీపీ పార్టీ మీద వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జగన్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు అది అసెంబ్లీలో అయినా సరే బయట అయినా కూడా ఎక్కువగా ఆయననే విమర్శిస్తూ ఉన్నారని.. ఎటువంటి కార్యక్రమం జరిగినా కూడా అది జగన్ ని విమర్శించడానికి చేస్తున్నారనే విధంగా ఆయన హెచ్చరించారు. వైసిపి పార్టీని ఎలాగోలాగా దెబ్బ కొట్టాలని కూటమిలో అందరూ ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ ఇది టిడిపి పార్టీలో వ్యూహం అయినప్పటికీ కూడా అలా చేయడం సరికాదు అంటూ కూడా కొలికపూడి  మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజల కోసం ఏం చెప్పామో అది చేయాలని తెలిపారు..ఇప్పటివరకు కూటమిలో ఈ విధంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: