మన దేశంలోని ప్రజలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బంగారం విషయంలో అనేక నియమ నిబంధనలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. పెళ్లైన మహిళలు 500 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండే అవకాశం ఉండగా పెళ్లి కాని మహిళలు 250 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండవచ్చు. పెళ్లి కాని పురుషులు మాత్రం 100 గ్రాముల బంగారం వరకు కలిగి ఉండవచ్చని చెప్పవచ్చు.
 
ఇంతకంటే ఎక్కువగా బంగారం ఉండాలంటే మాత్రం ఆదాయానికి తగిన ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేని పక్షంలో బంగారం జప్తు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మన దేశంలోని ప్రజలకు బంగారంపై మక్కువ ఎక్కువ కాగా ఆర్థిక స్థోమత ఆధారంగా చాలామంది బంగారం కొనుగోలు చేసే విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బంగారంపై ఇన్వెస్ట్ చేయడం ఎప్పటికీ సురక్షితమే అనే సంగతి తెలిసిందే.
 
చట్ట ప్రకారం ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించి బంగారం ఉంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. బంగారం విషయంలో ఈ నియమాలకు సంబంధించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే కొత్త ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. బంగారంను ఎక్కువగా వినియోగించే వాళ్లు ఈ విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
 
బంగారం కొనుగోలు చేసే సమయంలో కూడా ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. బంగారంను మరీ ఎక్కువగా కొనుగోలు చేయడం కూడా మంచిది కాదు. బంగారంను కొనుగోలు చేసేవాళ్లు 24 క్యారెట్ల బంగారం కొనాలంటే బి స్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బంగారంను ప్రముఖ షాపులలో కొనుగోలు చేయడం కంటే తెలిసిన వ్యాపారుల దగ్గర కొనుగోలు చేయడం మంచిది. రాబోయే రోజుల్లో తులం బంగారం లక్ష రూపాయలకు చేరే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: