ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఏపీలో నెలకొన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైసిపి పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఆ పార్టీలో నేతలు ఉంటారా ? లేక బయటకు వెళ్తారా అనే టెన్షన్ ప్రతిరోజు నెలకొంటుంది. 11 స్థానాలకు మాత్రమే వైసీపీ పార్టీ పరిమితం కావడంతో.. అందులో ఉండేందుకు కింది స్థాయి లీడర్ ల నుంచి పెద్ద స్థాయి లీడర్ల వరకు అందరూ టెన్షన్ పడుతున్నారు.

 చాలా ఆందోళనతో ఉంటున్నారు. ఎప్పుడు అరెస్టు అవుతామో అని పెన్షన్ లో కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో... జగన్మోహన్ రెడ్డికి మరో ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి ఇలాంటి కీలక నేతలు బయటకు వెళ్లిన నేపథ్యంలో... ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రత్యర్థి మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి... అజ్ఞాతంలోకి వెళ్లారు. మొన్నటి వరకు యాక్టివ్గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు బయటికి రావడం లేదు.

 వైసిపి పార్టీ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. ఇలాంటి నేపథ్యంలో వైసిపి గొంతును వినిపించాలనుకుంటే ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటికి వచ్చి.. ఏదో ఒకటి చేయాల్సి ఉండేది. కానీ  ఆళ్ల రామకృష్ణారెడ్డి అలా చేయడమే లేదు. సైలెంట్ గా ఇంట్లోనే కూర్చుంటున్నారు.  అంతేకాదు ఆయన జనసేన పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గ నేతలను... దగ్గర చేసుకోవాలని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.

 ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి వికెట్ కూడా తీశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జగన్కు అత్యంత నమ్మిన బంటుగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి పై పవన్ కళ్యాణ్ కన్ను పడిందట. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కాస్త సైలెంట్ గా ఉంటున్నారని సమాచారం. మంగళగిరి నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. 2014 అలాగే 2019 సంవత్సరాలలో జరిగిన... ఎన్నికలు విజయం సాధించారు రామకృష్ణారెడ్డి. అటు 2019లో  నారా లోకేష్ ను కూడా చిత్తు చేశారు. అలాంటి నేత జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యే ప్రమాదం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: