ఏపీలో గత ఎన్నికలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటుని సైతం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం చేసిన సంగతి తెలిసిందే.. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ వర్మకి కూటమినేతలు నచ్చచెప్పి ఆ సీటును కేటాయించేలా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మని అసలు ఎవరు పట్టించుకోలేదు. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ వర్మ ప్రాధాన్యత తగ్గించేలా అన్ని విషయాలలో అడ్డుపడుతున్నారని విధంగా ఏపీ అంతట వార్తలు వినిపిస్తున్నాయి.


అంతేకాకుండా ఇటీవలే పిఠాపురంలో జరిగిన కొన్ని సంఘటనలు అటు జనసేన, టిడిపి నేతల మధ్య వార్ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే వైసీపీ ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె జనసేన పార్టీ నాయకురాలు ఆయన క్రాంతి మాట్లాడుతూ వర్మకు ఎమ్మెల్సీ రాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారనే విషయం పైన గట్టి కౌంటర్ వేసింది.. ఎమ్మెల్సీ పదవి పై వర్మ టిడిపి తోనే తేల్చుకోవాలని ఇందులో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సంబంధం లేదంటూ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వర్మ అసంతృప్తి పై ఆమె పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.


వర్మ కు ఎమ్మెల్సీ రాకపోవడం అది కేవలం టిడిపి సొంత వ్యవహారమే అని మీరు తేల్చుకోవాల్సిన అంశం అంటూ తెలియజేశారు.ఈ విషయం పైన జనసేన పార్టీకి ఏ విధంగా సంబంధం లేదని తెలిపారు. అలాగే మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు నచ్చక ముఖ్యమంత్రి మిమ్మల్ని పక్కన పెట్టారేమో అన్నట్లుగా ప్రశ్నించారు.. ముందు మీ పార్టీ మీకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు తెలుసుకోండి అంతేకానీ జనసేన అని ఆడిపోసుకోకూడదు అంటూ క్రాంతి ప్రశ్నించారు. కూటమి మధ్య ఐక్యత విచ్ఛిన్నం చెడగొట్టాలని వైసీపీ నేతలు చేస్తూ ఉంటే.. మీరు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే మీరు వైసీపీ మీడియాలోనే కూడా హైలెట్ అవుతూ ఉన్నారు. ఇందులో నిజం కాదా అంటూ ఆమె ప్రశ్నించింది. అందుకు సంబంధించి ట్విట్ కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: