గత వారం రోజుల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉండే తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ బారిన పడ్డ కేసులు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాజాగా ఈ విషయం పైన వైద్య ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.. అక్కడ జనాలకు సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా తెలియజేశారు. రోగులకు సంబంధించిన అన్ని పరికరాలను కూడా వైద్యులు పరిశీలించారని మందులు కూడా పంపిణీ జరుగుతోందని మూడు నెలల తర్వాత మరొకసారి పరీక్షలు చేయబోతున్నట్లు వైద్యులు వెల్లడించారు.



రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్న మహిళలందరికీ కూడా వైద్య పరీక్షలు చేశారని క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తున్న ఈ బలభద్రపురం గ్రామంలో గత శనివారం రోజున వైద్య బృందాలు పర్యటించి అక్కడ నివసించే ప్రజలకు అన్ని పరీక్షలు కూడా చేశారట. సుమారుగా 93 మంది సిబ్బందితో 31 బృందాలు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి మరి వారి యొక్క ఆరోగ్య సమస్యలను గుర్తించి పరీక్షలు కూడా నిర్వహించారట. ఇందులో 38 మందికి ఎన్నో రకాల పరీక్షలు నిర్వహించగా 29 మందికి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా తెలియజేశారు వైద్యులు.


మిగిలిన 9 మందికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఇందులో ఎముకల సమస్యలతో ఇబ్బంది పడేవారు అలాగే గైనిక సమస్యలతో ఇద్దరు కిడ్నీ లివర్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అలాగే రక్తహీనతతో ఇబ్బంది పడేవారు ఉన్నట్లుగా వెల్లడించారు. ఇక రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలతో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అన్ని పరీక్షలు కూడా కొనసాగుతున్నాయని.. ఇలాంటి వారికి వైద్య నిపుణుల మార్గదర్శకంతోనే మందులు పంపిణీ జరుగుతూ ఉంటాయని ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్యులు ఈ గ్రామానికి వెళ్లి మరి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉంటామని తెలిపారు. బలబద్రపురంలో గర్భాశయం ముఖద్వారా క్యాన్సర్ 7 మంది నుంచి సేకరించినట్లుగా తెలియజేశారు. ఇందు గురించి ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: