రాయలసీమలోని రాప్తాడు నియోజకవర్గం టిడిపి ,వైసిపి మధ్య ఏదో ఒక రాజకీయ వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది. గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా ఇక్కడ ఎప్పుడూ కూడా వార్ రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి.. ఇటీవలే ఎంపీపీ, జడ్పిటిసి ఉప ఎన్నికలలో భాగంగా కొన్నిచోట్ల కూటమి నేతలు సైతం  వైసిపి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటన ఇప్పుడు రామగిరి మండలంలో కూడా చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అధికారుల తీరుపైన పరిటాల కుటుంబం పైన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.


రామగిరి ఎంపీపీ స్థానం సైతం మహిళలకు రిజర్వ్ ఉండగా మొత్తం మీద 9 ఎంపీటీసీలలో 8 మంది వైసీపీకి చెందిన వారే ఉన్నారు.. టిడిపికి కనీసం పోటీ చేయడానికి ఒక మహిళ ఎంపీటీసీ అభ్యర్థులు కూడా రాలేదట.అయినప్పటికీ కూడా పరిటాల కుటుంబం సుమారుగా 1000 మంది బలగాలతో ఎంపీడీవో కార్యాలయాన్ని సైతం చుట్టూ ముట్టారని తోపుదుర్తి ఫైరయ్యారు. ఈ విషయం పైన ఎస్పీ డిఎస్పి 73 భద్రాచలం సైతం నియంత్రించ లేకపోవడంతో పాటుగా సుధాకర్ యాదవ్ టిడిపి అండదండలతో అరాచకాలు సృష్టిస్తున్నారంటు ఫైర్ అయ్యారు.


ముఖ్యంగా వైసీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థులను సైతం బెదిరించి బలవంతంగా కిడ్నాప్ చేయించారంటూ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. చివరికి పేరూరు ప్రాంతంలో ఉన్న వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు భారతీయుని కూడా బలవంతంగానే ఎత్తుకెళ్లారంటూ ఆమె కూడా తెలియజేస్తోంది. టిడిపి నేతలకు సంబంధించిన కొంతమంది రౌడీషీటర్లు వైసీపీ ఎంపీటీసీ సభ్యుల వద్దకు వచ్చి బెదిరించారు అంటూ ఆరోపణలు చేశారు.. మా వెంటే రావాలని వైసీపీకి ఓటు వేయకూడదు అంటూ బెదిరించారట. ఇలాంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే రాబోయే రోజుల్లో పరిటాల కుటుంబం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందంటూ ఫైరయ్యారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా పలు రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: