ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఎక్కువగా వైసిపి నేతల మీద ఫోకస్ పెట్టి వారిని ఏదో ఒక కేసులో ఇరికించి మరి కొంతమందిని అరెస్టు చేయగా మరి కొంతమందిని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం మందస్తు బెయిల్ కి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.. ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రలో ఒక మాజీ మంత్రికి కేసుల బెడద ఎక్కువైనట్లుగా కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాస వైసిపి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మీద ఒక పోలీస్ కేసు నమోదు అయింది. ఈయన మీద కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.



పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఈయన మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద మాజీమంత్రి సిదిరి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే వారిపైన కేసులు పెడుతున్నారని ఈ విధంగా చేయడం సరైనది కాదని ఢిల్లీ రావు మృతి కేసులో నిజాలు తీర్చాల్సి ఉన్నదంటూ మాజీ మంత్రి డిమాండ్ చేయడం జరిగింది.. ఈ మేరకు తాను డీఎస్పీకి వినతి పత్రాన్ని కూడా అందించాను అంటూ తెలియజేశారు. కానీ ఈ కేసును మాత్రం తేల్చకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశామంటూ వెల్లడించారు.


అసలు విషయం ఇదే అయితే తాను తప్పు చేసినట్లుగా కొన్ని కేసులు పెట్టడం ఏంటి అంటూ వైసీపీ నేత సిదిరి అప్పలరాజు ఫైర్ కావడం జరిగింది. గతంలో కూడా టిడిపి వైసిపి అన్నట్టుగా  ఎన్నోసార్లు వార్ జరిగిందట. పలాసలో టిడిపి నేత గౌతు శిరీష ఎమ్మెల్యేగా అయ్యారు.. దీన్నిబట్టి చూస్తే ఇప్పుడు టిడిపి కూటమి ఈ వైసిపి మాజీ మంత్రి టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తున్నది.. ఈ మంత్రి పైన మరిన్ని కేసులు పెడతారని కార్యకర్తలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్న కూటమి మరి రాబోయే రోజుల్లో ఎవరెవరి మీద చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: