గత కొంతకాలంగా  కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు ప్రవేశపెడతామని అంటుంది.. ఇదే తరుణంలో తాజాగా  ఆలిండియా మజిలీస్ ఇచ్చే హాజద్ ముసల్మాన్  నాయకుడు ఓవైసీ తాజాగా చంద్రబాబు నితీష్ కుమార్ ను హెచ్చరించాడు. చంద్రబాబు, నితీష్ కుమార్, చౌదరిలను మేము ఎప్పుడు క్షమించమని మా షరియత్ పై మీరు దాడి చేస్తున్నారని అన్నారు. వక్ఫ్ బిల్లు తీసుకురావడానికి  బిజెపికి అనుమతిస్తున్నారని అన్నారు. వక్ఫ్ బిల్లుపై మీరు అభ్యంతరం చెబితే దాన్ని కేంద్రం తీసుకురాదు, కానీ మీరు మా మసీదులను నాశనం చేయడానికి మద్దతిస్తున్నారని అంటూ హెచ్చరించాడు. దీనిపై కొంతమంది రాజకీయ మేధావులు స్పందిస్తూ వక్ఫ్ బిల్లు గురించి పూర్తిగా తెలియకుండా ఓవైసీ ఇష్టం వచ్చినట్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నాడని అన్నారు. 

ఈ బిల్లు ప్రవేశపెట్టిన కానీ  ముస్లింలకు కానీ మసీదులకు కానీ ఎలాంటి హాని కలగదని అంటున్నారు. కొంతమంది ముస్లిం నాయకులు అబద్ధాలు చెబుతూ వక్ఫ్ బిల్లు వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని మసీదులు పోతాయని చెబుతూ ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారని తెలియజేశారు. సంబాల్లాంటి ఉదంతం ఎక్కడైనా జరిగి ఉంటే  అలాంటి వాటిని మాత్రమే రిటర్న్ తీసుకుంటారని, ఎవరి మతాలకు సంబంధించిన ఆస్తులను తీసుకునే హక్కు కేంద్రానికి కూడా లేదని తెలియజేశారు. వక్ఫ్ అంటే నీ మతానికి ఎవరైనా ఆస్తులు ఇస్తే దాన్ని ఇంకెవరైనా తీసుకోవడానికి లేదు.

భారతదేశంలో గుళ్ళు కూల్చేసి మసీదులు కట్టారు కానీ మసీదులు కూల్చేసి గుళ్ళు కట్టిన సందర్భాలు లేవని తెలియజేశారు.. ఇప్పటికే చంద్రబాబు నాలుగుసార్లు ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చారు అలాంటి ఆయన ముస్లింలకు అన్యాయం చేయాలని అస్సలు చూడారని తెలియజేశారు. దాని ముస్లింలకు సంబంధించిన పార్టీ నాయకులే ముస్లింల రెచ్చగొడుతూ వక్ఫ్ తప్పుడుగా ప్రచారం చేసి  మతకల్లోలాలు జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు కానీ, ముస్లిం మసీదులకు కానీ ఎలాంటి హాని జరగదని అక్రమ ఆస్తులు మాత్రమే రద్దవుతాయని తెలియజేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: