
తెలుగు ప్రజలు బాగుండాలని అటు సీఎం, తాను కోరుకుంటూన్నానని వెల్లడించారు. గత ప్రభుత్వం పైన మరొక సారి ఫైర్ అవుతూ వైసిపి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను సైతం చాలా ఇబ్బందులకు గురి చేశారంటూ ఐదేళ్లలో రాష్ట్రం చాలా కష్టాలలో ఉందని .. చంద్రబాబు అయితే అభివృద్ధి చేస్తారని ఆయనకు మద్దతు ఇచ్చానంటూ తెలియజేశారు. చంద్రబాబు సమర్థవంతమైన నాయకుడు , అనుభవజ్ఞులు కాబట్టే ఆయనకు మద్దతు ఇచ్చానని ముఖ్యమంత్రి అయ్యాక చాలామంది కార్మికుల జీవితాలలో వెలుగు వచ్చిందంటూ తెలియజేశారు.
సీఎం చంద్రబాబు ఎదుగుతున్న క్రమంలోనే చాలామందికి మంచి సలహాలు ఇచ్చే వారిని ఆ సలహాల వల్ల యువత ఎన్నో అద్భుతమైన వాటిని సృష్టిస్తున్నారంటూ ఈ క్రమంలోనే మనమంతా కూడా చిన్న చిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అందుకే సీఎం చంద్రబాబు సమక్షంలోనే ఏపీ స్వర్ణాంధ్రగా మారుతుందని తనకి నమ్మకం ఉందని తెలియజేశారు. సాధారణంగా నాయకులు ఎక్కువగా రాజకీయాలు ఎన్నికల గురించి ఆలోచిస్తూ ఉంటారని కానీ సీఎం చంద్రబాబు రాబోయే తరం గురించి ఆలోచిస్తారంటూ పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ వ్యాఖ్యలను కొంతమంది కూటమినేతలు కార్యకర్తలు సపోర్టు చేస్తూ ఉండగా మరి కొంతమంది అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 9 నెలలు అవుతూ ఉన్న ఏం చేపట్టారు అంటూ ప్రశ్నిస్తున్నారు.