ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్త చిక్కులు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో 11 స్థానాలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి పార్టీని కకావికులం చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల స్కెచ్ లు వేస్తోంది. మళ్లీ వైసీపీ పార్టీలో ఒక్క నేత ఉండకుండా... చంద్రబాబు నాయుడు స్కెచ్ వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే వరుసగా వైసీపీ నేతలపై కేసులు ఆ తర్వాత అరెస్టులు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు...  ఏపీలో భూ దందాలు జరిగాయని.. కొత్త అంశం తెరపైకి వచ్చింది.

 రెవెన్యూ శాఖలో జరిగిన అవకతవకలపై... చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. మొత్తం 13.59 లక్షల ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్  చేసినట్లు గుర్తించారట. అంతేకాదు.. చట్ట వ్యతిరేకంగా నిషేధ జాబితా నుంచి 5.74 లక్షల ఎకరాలకు విముక్తి కలిగించినట్లు... కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 8483 ఎకరాలు... జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని... కూటమి  అంతర్గత విచారణలో తేలిందట.

 అంతేకాదు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ఉన్న ఆరుగురు మంత్రులకు... ఈ భూముల దందాలో పాత్ర ఉందని కూడా తేలిందని అంటున్నారు. 42 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారట. 120 మంది వైసీపీ నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు... కూతమి నేతలు చెబుతున్నారు.  22 మంది డిప్యూటీ కలెక్టర్లకు కూడా ప్రధాన పాత్ర ఉందని అంటున్నారు.  48 మంది తహసిల్దార్లు అలాగే 23 మంది సర్వేలు కూడా ఇందులో ఉన్నారట.

 ఈ మేరకు చంద్రబాబు నాయుడు దగ్గరికి రెవెన్యూ శాఖ నివేదిక కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణమైనా వీళ్ళ అందరిపై చర్యలు ఉంటాయని కూడా కూటమి నేతలు చెబుతున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న అధికారులు అలాగే నేతలపై క్రిమినల్ చర్యలకు కూడా సిఫారసు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎలాంటి  నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: