పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే. విజయవాడకు రాకముందే పాస్టర్ ప్రవీణ్ కు ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం అందుతోంది. తొలిసారి రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలోనే బుల్లెట్ హెడ్ లైట్ పగలగడంతో పాటు పాస్టర్ చేతికి గాయాలు అయ్యాయని సమాచారం అందుతోంది. తొలిసారి జరిగిన యాక్సిడెంట్ లో బుల్లెట్ హెడ్ లైట్ పగలడంతో పాటు పాస్టర్ చేతికి గాయాలు అయ్యాయట.
 
గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరకు పాస్టర్ ప్రవీణ్ చేరే సమయానికే ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నారని మాట్లాడలేని స్థితిలో ఆయన సైగలు చేశారని తెలుస్తోంది. రామవరప్పాడు రింగ్ సమీపంలో ఆయనకు రెండోసారి ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ ఎస్సై, ఆటో డ్రైవర్లు ఆయనను పక్కన కూర్చోబెట్టగా పాస్టర్ ట్రాఫిక్ బూత్ దగ్గర 3 గంటలు నిద్రపోయారట.
 
మద్యం మత్తులో వాహనం నడపడం మంచిది కాదని ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావు పాస్టర్ కు కౌన్సిలింగ్ చేశారట. అక్కడినుంచి వెళ్లొద్దని వారించినా పాస్టర్ ప్రవీణ్ మాత్రం పట్టించుకోకుండా ప్రయాణం చేశారట. ఆ తర్వాత పాస్టర్ ప్రవీణ్ ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతూ ఉండటం గమనార్హం. పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను పరిశీలించారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ప్రవీణ్ మృతి కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పోలీసులు సాంకేతికంగా అన్ని ఆధారాలను సేకరించారని తెలుస్తోంది. పాస్టర్ ప్రవీణ్ మరణం ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదనే అభిప్రాయాలు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: