హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు నిత్యం ప్రయాణించే వాహనదారులకు ఇది నిజంగా గుడ్‌ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ చార్జీలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారి 65 (NH 65)పై ప్రయాణం మరింత సులభతరం, చౌకగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు NHAI ప్రకటించింది. తగ్గిన ఈ కొత్త రేట్లు ఈరోజు అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.

• ఏ టోల్ ప్లాజాల వద్ద తగ్గాయి? ఎంత తగ్గాయి?

ఈ కొత్త, తగ్గిన రేట్లు ప్రధానంగా మూడు టోల్ ప్లాజాల వద్ద వర్తిస్తాయి. అవేంటంటే:

పంతంగి టోల్ ప్లాజా (చౌటుప్పల్ మండలం, తెలంగాణ)

కొర్లపహాడ్ టోల్ ప్లాజా (కేతేపల్లి మండలం, తెలంగాణ)

చిల్లకల్లు టోల్ ప్లాజా (ఆంధ్రప్రదేశ్)

పంతంగి టోల్ ప్లాజా కొత్త రేట్లు ఇవే:

• పంతంగి ప్లాజా దగ్గర వాహనాల వారీగా కొత్త రేట్లు ఇలా ఉన్నాయి

కార్లు, వ్యాన్లు, జీపులు: ఒక్కసారి వెళ్తే (వన్-వే) రూ.15, వెళ్లి రావడానికి (అప్ అండ్ డౌన్) రూ.30 మాత్రమే.

లైట్ గూడ్స్ వాహనాలు (చిన్న లారీలు): వన్-వేకి రూ.25, అప్ అండ్ డౌన్ కి రూ.40.

ట్రక్కులు, బస్సులు: వన్-వేకి రూ.50, అప్ అండ్ డౌన్ కి రూ.75.

చిల్లకల్లు టోల్ ప్లాజాలోనూ తగ్గింపు:

ఇక చిల్లకల్లు టోల్ ప్లాజా విషయానికొస్తే, ఇక్కడ కూడా అన్ని రకాల వాహనాలకు వన్-వే ట్రిప్ పై రూ.5, అప్ అండ్ డౌన్ ట్రిప్ పై రూ.10 చొప్పున తగ్గించారు. ఇది అన్ని కేటగిరీల వాహనాలకు వర్తిస్తుంది.

* రిటర్న్ జర్నీ చేసేవారికి స్పెషల్ డిస్కౌంట్

మీరు 24 గంటల్లోపే తిరుగు ప్రయాణం చేస్తే, టోల్ చార్జీపై ఏకంగా 25% డిస్కౌంట్ ఇస్తారు. అంటే, వెళ్లి వచ్చినందుకు కట్టే టోల్ పై పావు వంతు తగ్గింపు అన్నమాట. ఈ సూపర్ డిస్కౌంట్ పైన చెప్పిన మూడు టోల్ ప్లాజాల్లోనూ లభిస్తుంది.

* ఈ కొత్త రేట్లు ఎప్పటి వరకు?

ఈ తగ్గిన టోల్ ధరలు తాత్కాలికం కాదు. ఇవి ఏకంగా 2026, మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని NHAI స్పష్టం చేసింది. అంటే దాదాపు రెండేళ్ల పాటు ఈ తక్కువ చార్జీలతోనే ప్రయాణించవచ్చు. హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ వసూలు 2012, డిసెంబర్ లో మొదలైంది. గత ఏడాది వరకు జీఎంఆర్ (GMR) సంస్థ ఈ టోల్ వసూలు బాధ్యతలు చూసుకుంది. కానీ ఇప్పుడు, NHAI నేరుగా రంగంలోకి దిగి, తన ఆధ్వర్యంలోని ఏజెన్సీల ద్వారా టోల్ వసూలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: