ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయి ఇప్పటికి 12 సంవత్సరాలు పైనే అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడైతే విడిపోయాయో అప్పటినుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కనిపించకుండా పోయింది. అయితే 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కూతురు కావడం చేత వైయస్ షర్మిల కి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఇవ్వడం జరిగింది. దీంతో కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ పేరు వినిపించినప్పటికీ ఆ ఎన్నికలలో మాత్రం ఏ ఒక్కరిని కూడా విజయాన్ని అందుకునేలా చేయలేకపోయారు. కానీ ఓట్లు అయితే చీల్చడం జరిగింది.


అయితే చాలామంది సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ షర్మిలకి అప్పగించడం వల్ల చాలా పెద్ద విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. షర్మిల సీనియర్లను సైతం లెక్కచేయకుండా తన మాటే వినాలని చెప్పడం ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఉండడంతో దీంతో సీనియర్లు సైతం విసిగిపోతున్నారు.. అందుకే సీనియర్ల సైతం పార్టీని వీడి ఎవరిదారిలో వారు నడుస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు కీలకమైన నాయకులు కూడా పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటీవలే శైలజానా పార్టీ మారి వైసిపి పార్టీలోకి చేరారు.


ఇప్పుడు తాజాగా కడపలోనే భారీ ఎదుగుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఆఫ్జల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కడప కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా ఈ నేత  గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా అక్కడ 25 వేల ఓట్లు చీల్చారు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత షర్మిల అసలు తమను పట్టించుకోవడంలేదని వ్యక్తిగత రాజకీయాలే చేస్తున్నారంటూ చాలామంది పార్టీని వీడుతూ ఉన్నారట. అలా ఆఫ్జల్ కూడా వీడడం జరిగింది. షర్మిల కి రాజకీయాలే అవసరం లేదంటూ చాలా ఘాటుగానే తెలిపారట. షర్మిల మారేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోలేదంటూ చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. కేవలం కూటమి పార్టీకి మాత్రమే సహకరించేలా వ్యవహరిస్తోందంటూ మరి కొంతమంది తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: