వైయస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా కొత్త స్కెచ్ లు వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ... వైసిపి అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రోజుకు ఒకరి పైన కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే వైసిపి నేతలు వరుసగా జైలు పాలు అవుతున్నారు. కొంతమంది వైసీపీ నేతలు ఏపీని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి దాక్కుకుంటున్నారు. విజయసాయిరెడ్డి లాంటివారు రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. సేఫ్ జోన్ లోకి వెళ్లారరు.


కానీ వైసీపీ పార్టీ సోషల్ మీడియా మాత్రం చాలా బలంగా ఉంది. ఇటీవల విశ్వక్ సినిమా కారణంగా... పృధ్వీరాజ్ చేసిన కామెంట్లకు.. వైసిపి నుంచి మంచి  కౌంటర్ వచ్చింది. సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు వైసీపీ పార్టీ కార్యకర్తలు. అటు కిరణ్ రాయల్  విషయంలో కూడా వైసిపి సక్సెస్ అయింది. కిరణ్ రాయల్ నిద్రపోకుండా.. చుక్కలు చూపించారట వైసిపి కార్యకర్తలు.


ఇది ఇలా ఉండగా... ప్రస్తుతం వైసీపీ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. కొంచెం లైట్ తీసుకున్న వైసీపీ పార్టీ... ప్రమాదంలో పడిపోతుంది. కాబట్టి ఎలాగైనా పార్టీని కాపాడుకునేందుకు... బెంగళూరు ప్యాలెస్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారట జగన్మోహన్ రెడ్డి. పార్టీ కీలక నేతలు.. మరికొంతమంది వైయస్సార్ కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి చర్చలు నిర్వహించారట.


ఈ సందర్భంగా భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ  తీసుకోవాలి...? ఇలా ముందుకు పార్టీని తీసుకువెళ్లాలి అనే దానిపైన చర్చలు నిర్వహించారట. చివరికి... ఏపీలో మరోసారి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించాలని చెబుతున్నారు. మరోసారి పాదయాత్ర నిర్వహిస్తే కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఓ నిర్ణయానికి వచ్చారట. మరో మూడు నెలల సమయం టిడిపి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్లబోతున్నారట ఈ మేరకు బెంగళూరు ప్యాలస్ లో  తీర్మానం అయిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: