టిడిపి పార్టీలో చాలా మంది సీనియర్ నేతలే కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు కూడా తన తర్వాత పార్టీని ఎవరు ముందుకు నడిపించాలనే విషయం పైన పలు రకాల వ్యూహాలను కూడా రచిస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఎక్కువగా నారా లోకేష్ అని చాలామంది వినిపిస్తూ ఉన్నప్పటికీ మరి కొంతమంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పేరుని ప్రస్తావిస్తూ ఉన్నారు. చాలా సందర్భాలలో ఎన్టీఆర్ పేరుని పలు రకాల సభలలో ప్రస్తావించిన కూడా చాలామంది నేతలు నానా మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవలే 2024 లో టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ లో కూడా టిడిపి పార్టీకి పూర్వ వైభవం తేవాలి అంటూ అక్కడ అధ్యక్ష పదవికి ఎన్టీఆర్ ను నియమించేలా ప్లాన్ చేస్తున్నారట.


ఒకవేళ ఎన్టీఆర్ ఒప్పుకోకుంటే ఆయన కుటుంబంలోని ఎవరైనా మహిళలకు టిడిపి అధ్యక్షురాలుగా చేయాలనే విధంగా వ్యూహం రచిస్తున్నారట చంద్రబాబు. టిడిపి పార్టీ తెలంగాణలో పుంజుకోవడానికి కొన్నేళ్ల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అక్కడ పూర్తిగా ఉనికి కోల్పోయారు. ఇక గత ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత మళ్లీ తమ బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలోనే టిడిపి నేతలు కూడా తెలంగాణలో టిడిపి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చంద్రబాబును కోరారు.


ముఖ్యంగా కేంద్రంలో బిజెపి పార్టీ ఏపీలో టిడిపి పార్టీ అధికారంలో ఉండడంతో తెలంగాణకు కూడా కొంతమేరకు బలం కలిసేస్తుందని తెలంగాణలో టిడిపి పార్టీని మళ్ళీ పునర్విభజన చేయాలనే విధంగా సీఎం చంద్రబాబుని చాలామంది సీనియర్ నేతలు కూడా కోరుతున్నారట. అంతేకాకుండా తెలంగాణలో ఇతర పార్టీలలో నుంచి టిడిపి పార్టీలోకి చేరడానికి సిద్ధంగానే చాలామంది నేతలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోందట. తెలంగాణలో టిడిపి పార్టీ మళ్లీ తీసుకువస్తారా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: