
ప్రధాన మోదిగా 2014లో నరేంద్ర మోడీ బాధ్యతలను సైతం తీసుకున్న తర్వాత..RSS భవనానికి వచ్చారని ఈ విషయం మీదే ఆయన వివరించడానికి అక్కడికి వచ్చారని సంజయ్ రౌత్ వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని సృష్టించేలా ఉన్నాయి.. 2014 నుంచి ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మోడీ రాలేదని తాజాగా వచ్చారని తెలిపారు సంజయ్ రౌత్.. అయితే ఆయన సడన్ గా అక్కడికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు? తనకు ఉన్న సమాచారం ప్రకారం..RSS దేశ న్యాయకత్వంలో కూడా మార్పు కోరుకుంటున్నారని అందుకే ప్రధాన మోడీ కాలం కూడా ముగిసిందనే విధంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. RSS కూడా ప్రధాన మోడీ ఎవరు అనే విషయాన్ని నిర్ణయిస్తుందని వెల్లడించారు.
RSS నిబంధనల ప్రకారం బిజెపి నాయకులలో ఎవరైనా 74 ఏళ్లు పైబడిన వారు కీలక పదవులలో ఉండకూడదని నియమం కూడా ఉన్నదట. ప్రస్తుతం నరేంద్ర మోడీ కి 74 వ సంవత్సరం నడుస్తున్నది సెప్టెంబర్ 17న మోడీ 75వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.. అందుచేత RSS ఆయన చేత ప్రధానమంత్రి పదవికి సైతం రాజీనామా చేయించే అవకాశం ఉన్నదంటే తెలిపారు ఎంపీ సంజయ్ రౌత్. అయితే ఈ వార్తలను కొంతమంది నేతలు ఖండిస్తూ 2029 లో కూడా మోదీని ప్రధానమంత్రి అంటూ తెలుపుతున్నారు.