ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జెండాను నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పట్టుకున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు కుటుంబానికి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉంటారని గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు లేదా బాలయ్య ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా కూడా... జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా చాలా సందర్భాల్లో వెళ్లలేదు.

 దింతో చంద్రబాబు, బాలయ్యలతో నందమూరి వారసులు ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరికీ చెడిందని చాలామంది ప్రచారం చేశారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని నందమూరి కళ్యాణ్... సందడి చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నరసరావుపేటకు కళ్యాణ్ రామ్ వచ్చారు. ఈ సందర్భంగా అభిమాని నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను అడిగి మరీ పట్టుకున్నారు కళ్యాణ్ రామ్.  

 దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అయితే ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు  లక్షల్లో ఉంటారు. వాళ్లందరినీ ఆకట్టుకునేందుకే కళ్యాణ్ రామ్... ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకున్నాడని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది తన తాత పార్టీ కాబట్టి.. జెండా పట్టుకునే హక్కు కళ్యాణ్ రామ్ కి మాత్రమే ఉందని కామెంట్ చేస్తున్నారు.

 మొత్తానికి కళ్యాణ్ రామ్... తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకోవడం హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా...  ఇటీవల చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కంటే ముందు... జూనియర్ ఎన్టీఆర్... ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా... సైలెంట్ గానే ఉన్నారు. చాలామంది టీడీపీ పార్టీ తరఫున ప్రచారం చేయాలని కోరారని సమాచారం. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎవరికీ సపోర్ట్ చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు మాత్రం శుభాకాంక్షలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: