
రాజమండ్రి లలిత నగర్ కు చెందిన దేవా బత్తుల నాగ మహేష్... ను అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. నాగ మహేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ తరుణంలోనే మహేష్ కు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో.... మహేష్ ను సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై... పోలీసుల దర్యాప్తులో కీలక పరిణామం జరిగింది.
మార్చి 24వ తేదీన హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లే వరకు అన్ని సీసీ కెమెరాలు పోలీసులు... పరిశీలన చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత రెండు సార్లు ఆయన బైకుకు ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా బైక్ డ్రైవ్ చేసుకుంటూ... రాజమండ్రి వెళ్లారు పాస్టర్ ప్రవీణ్. విజయవాడలో 3 గంటల పాటు ప్రవీణ్ మిస్సింగ్ పై పోలీసులకు... క్లారిటీ వచ్చింది.
ఈ తరుణంలోనే... పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బైక్ నడుపుతూ.. పాస్టర్ ప్రవీణ్ ఇబ్బంది పడ్డట్లు పోలీసులు గుర్తించారు. అలాగే లిక్కర్ షాపులో మద్యం కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు వీడియోలు బయటకు రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలలో బైక్ నడుపుతూ... మందుబాబు తరహాలో అటు ఇటు తూలాడు ప్రవీణ్. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.