
ఈ కేసుల వల్ల ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో జగన్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జగన్ చుట్టూ మీడియా గేమ్, మైండ్ గేమ్ జరుగుతోందని తెలుస్తోంది. జగన్ కు దగ్గరగా ఉండాలంటే నేతలు భయపడేలా పరిస్థితులు క్రియేట్ కానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే కూటమి సర్కార్ కు షాకిచ్చేలా జగన్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
జగన్ సైలెంట్ గా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని ఈ విషయాలను జగన్ సైతం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది. జగన్ పాలనలో సంక్షేమ పథకాలు బాగానే అమలైఆ అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. జగన్ తెలివిగా ముందడుగులు వేస్తే బాగుంటుందని నెటిజన్లు సైతం సూచిస్తున్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో సైతం కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
జగన్ సరైన ప్రణాళికలతో ముందడుగులు వేస్తే 2029 సంవత్సరంలో రాజకీయంగా సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. వైసీపీ పుంజుకునే దిశగా జగన్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. వైసీపీ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో చూడాలి. ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. చంద్రబాబు చెప్పిన ప్రతి హామీని నెరవేరిస్తే మాత్రం కూటమి సర్కార్ కు మేలు జరుగుతుంది. అయితే పథకాల అమలు విషయంలో బాబు నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.