- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .


తెలంగాణ క్యాబినెట్ విస్తరణ త్వరలో జరుగుతుందని లీకులు వస్తున్నాయి. ఉగాది రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిసి ఎవరెవరిని మంత్రులుగా తీసుకోవాలని లిస్ట్ కూడా ఇచ్చారట. ఈ లిస్టులో నలుగురు పేర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ ప్రకారం చూస్తే క్యాబినెట్లు రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ పెరిగే అవకాశం కనబడుతోంది. క్యాబినెట్లో చేర్చుకోవడానికి వ్యతిరేకత ఉన్న.. ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వబోతున్నారని ప్రచారం. వారిద్దరూ ఎవరో కాదు.. ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రెండో వ్యక్తి గడ్డం వివేక్‌. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లి ఎన్నికలకు ముందు మళ్ళీ చేరారు.


ఇక రాజగోపాల్ రెడ్డి అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. మళ్లీ ఆయన తమ్ముడైన రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వటం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇక మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ కు.. మంత్రి పదవి ఇవ్వటాన్ని మాదిగ సామాజిక వర్గం వ్యతిరేకిస్తుంది. అది కాకుండా ఆయన అన్నయ్య వినోద్ కూడా ఎమ్మెల్యే. మరో కుటుంబ సభ్యుడు వంశీకృష్ణ ఎంపీగా ఉన్నారు. ఇలా కలుపుకుంటే ఆ కుటుంబంలో ముగ్గురు చట్టసభలో సభ్యులుగా ఉన్నారు.


ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు.. బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి.. వీరిద్దరికి క్యాబినెట్లో పదవులు ఇస్తే రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ పెరుగుతుంది. ఎప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇక ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మరో ఇద్దరు చేరితే రెడ్డి మంత్రులు మొత్తం ఆరుగురు అవుతారు. ఇక బీసీల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే.. వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు మంత్రి పదవి ఇస్తారని సమాచారం.


ఇప్పటికే మాదిగ, లంబాడా, ముస్లిం సామాజిక వర్గాలకు న్యాయం జరిగింది. మంత్రి పదవులు ఇవ్వాలని సామాజిక వర్గాల నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఒక్క తాటి మీదకు వచ్చారు. మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో స్థానం లేకపోవడంతో.. వారు కూడా మంత్రి పదవి కోరుతున్నారు. ఓవరాల్‌గా చూస్తే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం స్పష్టంగా కనపడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: