- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . . .

టిడిపిలో తరంతోపాటు.. స్వరాలు కూడా మారుతున్నాయి. ప్రస్తుత త‌రానికి అనుకూలంగా రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో.. ఆదిశగానే టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కొంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు సీనియర్లను పక్కన పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి వారిలో మాజీమంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఒకరు. ఎనమల రాజకీయాలు.. ప్రారంభమైంది టిడిపి తోనే. అన్నగారి పిలుపుతో రాజకీయాలకు వచ్చిన రామకృష్ణుడు.. తర్వాత కాలంలో స్పీకర్‌గా మంత్రిగా పనిచేశారు.


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం నుంచి.. ఆరుసార్లు వరుసగా అప్రతిహత విజయాలు దక్కించుకున్న రామకృష్ణుడు.. తొలిసారి 2009లో ఓడిపోయారు. 2014 ఎన్నికలలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని ఆయన తమ్ముడు యనమల కృష్ణుడుకు అవకాశం ఇప్పించారు. కృష్ణుడు 2014, 2019 రెండు ఎన్నికలలో వరుసగా ఓడిపోయారు. ఇక గత ఎన్నికలలో యనమల కుమార్తె దివ్య పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో యనమల కుటుంబం నుంచి యువ నాయకరాలు రంగంలోకి వచ్చినట్టు అయింది. ఎమ్మెల్సీగా యనమల పదవీకాలం ముగిసింది. మరోసారి ఆయనకు రెన్యువల్ ఉంటుందని అందరూ భావించారు.


కొత్తవరికి అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు యనమలను పక్కన పెట్టారు. బీసీ, యాదవ సామాజిక వర్గం నుంచి బీదా రవిచంద్ర యాదవ్ కు అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పుడు యనమల ఫ్యూచర్ ఏంటన్న ప్రశ్నలు తెరమీదకి వస్తున్నాయి. యనమల రామకృష్ణుడు, దివంగత ఎన్టీఆర్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనేక సందర్భాలలో బీసీలు తరపున ప్రతినిధిగా యనమల ఉన్నారు. టిడిపిలో ఏర్పడిన సంక్ష‌భం సమయంలో స్పీకర్ గా ఉన్న రామకృష్ణుడు అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను తప్పుపట్టారు. తనకు ఒక్క నిమిషం కూడా మైకు ఇవ్వడం లేదని.. ఇదేనా మీ విజ్ఞత అని దుయ్య బట్టారు. అయితే ప్రస్తుతం యనమల కుటుంబం నుంచి వియ్యంకుడు సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యే గా ఉంటే.. అల్లుడు మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలోనే యనమల రాజకీయంకు దాదాపు తెరపడిందని అనుకోవాలి. ఇకనుంచి ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఆయన వారసులుగా రాజకీయాలలో కొనసాగుతారు అనుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: