
పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలలో మన వద్ద సత్తా లేనప్పుడు సత్తా ,ప్రతిభ ,బలం ,సమర్ధత తెలివితేటలు ఉండేటువంటి నాయకులకు మాత్రమే మనం మద్దతు ఇవ్వాలనుకున్నానని అందుకే చంద్రబాబుకి మద్దతు ఇచ్చారు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే ఇలా మాట్లాడిన వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గానికి, జనసైనికులకు తీవ్ర ఇబందిని కలిగించేలా ఉన్నాయట. ఏపీలో ఓటు శాతం అధికంగా కాపు వర్గానికి ఉన్నది. కొన్ని జిల్లాలలో ఏ వైపుగా ఉంటే ఆ వైపుగానే నేతలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాపులలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటూనే ఉన్నారు. కానీ టిడిపి వస్తే కమ్మ వాళ్లు.. వైసిపి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే తప్ప కాపు సామాజిక వర్గానికి అవకాశం రాలేదని తెలుపుతున్నారు.
ఇలాంటి సమయంలో జనసేన పార్టీని సొంతగా పవన్ కళ్యాణ్ నడిపిస్తారని భావించినప్పటికీ ఆదిశగా మాత్రం అడుగులు వేయలేదని సోషల్ మీడియాలో జనసైనికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సత్తా లేదని ఒప్పుకోవడం అంటే కచ్చితంగా అది రాజకీయ వైఫల్యమే అంటూ తెలియజేస్తున్నారు. గతంలో తన అన్న చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని 2008లో పెట్టినప్పుడు కాపు సామాజిక వర్గం ఆనందంగా సపోర్ట్ చేసిన కానీ విజయాన్ని అందుకోలేకపోయారు. కేవలం 18 సీట్లను మాత్రమే గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి టిడిపి పార్టీతో కలిసి ముందుకు వెళుతున్నారు.దీంతో రాబోయే రోజుల్లో టిడిపి పార్టీలోని విలీనం చేస్తారా అనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.