ఏపీ రాజకీయాలలో కూటమి ప్రభుత్వం గురించి ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నది.అటు వాలంటరీల విషయం, సూపర్ సిక్స్ హామీలు, ఇసుక విధానం ఇతరత్రా వాటిపైన కూడా ఏదో ఒక విషయం వినిపిస్తూ ఉంటుంది. ఫ్రీ ఇసుక అనే విధానాన్ని సైతం తీసుకు వచ్చినప్పుడు చాలా గ్రాండ్ గా చేసినప్పటికీ కానీ ప్రభుత్వానికి తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉందని టన్నుకి కొంతమేరకు డబ్బులను కూడా వసూలు చేస్తున్నారు. దీనిపైన అటు ప్రజలే కాకుండా ప్రతిపక్ష నేతలు కూడా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది.


కూటమి ప్రభుత్వం లో టన్ను 1300 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఫ్రీ ఇసుక అంటే ఇదేనా అంటూ ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇక వీటి పైన కూడా ఇప్పటికే చాలామంది ప్రజలు విమర్శిస్తూ ఉన్నప్పటికీ తాజాగా ఒక టిడిపి అభిమాని ఓటు కూడా టిడిపికే వేశానని టిడిపి గెలిచిన తర్వాత ఎందుకు గెలిపించామా అని మాట్లాడుతున్నారు.. అక్రమంగా ఇసుకని అమ్ముకుంటున్నారని పైన ఉన్న నేతలే ఫ్రీగా ఇవ్వమని చెప్పిన కూడా ఇక్కడ లోకల్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని విధంగా ఆరోపణలు చేస్తున్నారు.


అలాగే సిటీలలో ఆటో వాళ్లను ఎంట్రీ కానివ్వకుండా చేస్తున్నారని చంద్రబాబు పాలనలో ఒక్కడు కూడా సంతోషంగా లేరని తెలిపారు. ఎక్కిన కాటు నుంచి ఆటోల మీదే పడుతూ ఉన్నారు.. అందరికీ ఫైన్లు వేస్తున్నారంటూ తెలుపుతున్నారు. 20 ,30 ఎకరాలు ఉన్న వారందరికీ కూడా పింఛన్లు ఇస్తున్నారు అంటూ మరొక వ్యక్తి ఆరోపించారు చంద్రబాబు సీఎం అవ్వగానే రోడ్లను అభివృద్ధి చేస్తానని చెప్పారు. కానీ అలాంటిదేమీ చేయలేదంటూ తెలుపుతున్నారు. టిడిపి అభిమాని అయ్యుండి ఇలా మాట్లాడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తానికి టిడిపి పాలన చూసి తమకు విరక్తి వచ్చిందని టిడిపి అభిమానులే వెల్లడిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: