
ప్రస్తుతానికైతే ఏపీ పోలీసులు సాధారణ మరణం కింద కేసు బుక్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే పాస్టర్ కావడంతో వైసిపి నేతలు ఈ అంశాన్ని చాలా గట్టిగా గ్రౌండ్ స్థాయిలో తీసుకు వెళుతున్నారు. క్రైస్తవులు అంటే ఏపీ ప్రభుత్వానికి పట్టింపు లేదని... ఒక పాస్టర్ మరణిస్తే... ప్రభుత్వం రెస్పాన్స్ అస్సలు కావడం లేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రవీణ్ పగడాల మృతి సందర్భంగా... ఏపీలోని పాస్టర్లు అందరికీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత కలిశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ల యూనియన్ సంఘం సభ్యులు. ఈ సందర్భంగా ప్రవీణ్ పగడాల కేసు పై ఏపీ హోం మంత్రి అనిత తో చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ల యూనియన్ సంఘం సభ్యులు. దాదాపు గంటపాటు ఏపీ హోంమంత్రి అనితతో పాస్టర్లు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ హోం మంత్రి... అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసును విచారణ చేస్తున్నామని.. ఏపీ పోలీసులు దీనిపై లోతుగానే విచారణ చేస్తున్నారని ఆమె వెల్లడించారు. అతి త్వరలోనే పాస్టర్ ప్రవీణ్ మరణం పై క్లారిటీ వస్తుందని కూడా కీలక ప్రకటన చేశారు ఏపీ హోం మంత్రి. ఈ కేసు పై సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రతిరోజు ఆరా తీస్తున్నాడని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై దృష్టి సారించాలని కూడా వివరించారు.