
ఈ రేషన్ కార్డ్ బ్యాక్ సైడ్ లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఉంటాయని కొత్త కార్డుకు సంబంధించిన మనోహర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్డ్స్ కి అదనంగానే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్తగా రైస్ కార్డ్స్ ని తీసుకురాబోతున్నామని ఈ కార్డుని ముఖ్యమంత్రికి చూపించామంటూ తెలిపారు. క్రెడిట్ కార్డు సైజులోనే క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని ఈ కార్డును కొత్తగా లాంచ్ చేయబోతున్నామని అది కూడా సిస్టమాటిక్ గా ఉంటుందని తెలిపారు. అయితే ఈసారి ఈ కొత్త కార్డులో గతంలో కంటే చాలా క్లియర్ గా అక్షరాలు ఉంటాయని అవి తెలిపారు.
ఏపీ అంతట ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయన్నవి ఈ కేవైసీ ద్వారా పూర్తి అవుతుందని ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఈ కేవైసీ గడువు ఉంటుంది అంటూ తెలిపారు. ఏపీలో అయితే ఇప్పటికి 93 శాతం పూర్తి అయినదని.. కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా వారికి సంబంధించిన ఫోటోలు పెట్టదని ప్రతి ఒక్కరిని గౌరవించేలా రైస్ కార్డు నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది అంటూ తెలిపారు. ఇక కుటుంబ సభ్యుల తొలగింపు, స్లిప్ట్ కార్డుల ఆప్షన్ ఇస్తామని.. క్యూ ఆర్ కోడ్ కూడా ఫ్యామిలీ కార్డ్ భద్రత ఫీచర్లతో లభిస్తుందని తెలిపారు మంత్రి మనోహర్ .