
యోగి ఆధిత్యనాథ్ మాట్లాడుతూ మోడీ రిటైర్మెంట్ గురించి తన రాజకీయ భవిష్యత్తు గురించి తెలియజేశారు.. తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రినని ఉత్తర ప్రదేశ్ లో పేద ప్రజలకు సేవ చేయడానికి తాను పార్టీ ఇక్కడ పెట్టానని రాజకీయాలు తన ఫుల్ టైం కాదని.. తన పని తాను చేసుకుంటున్నానని తాను కేవలం యోగిని మాత్రమే అంటూ తెలిపారు. తాను తన పార్టీ వల్లే ఇక్కడ ఉన్నారని కేంద్ర నాయకులతో భేదాలు వస్తే ఇక్కడ ఉండగలుగుతానా? అంటూ తెలియజేశారు. పార్టీకి సంబంధించిన పార్లమెంట్ బోర్డ్ కమిటీ టికెట్లు సైతం ఎవరికి ఇవ్వాలనే విషయాలను నిర్ణయిస్తుందని తెలిపారు.
అయితే ఇందులో కూడా చాలా రకాల వడపోతలు కూడా ఉంటాయని ఊరికే నోటికి వచ్చిన తర్వాత మాట్లాడుతూ చాలామంది ఉంటారు.. ఆ నోళ్లను మనం ఆపలేమంటూ తెలిపారు.యోగి ఆధిత్యనాథ్ గత తొమ్మిదేళ్లుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలను చేపట్టారు ఎక్కువ సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పని చేసిన రికార్డును సైతం చేసుకున్నారు. ముఖ్యంగా అక్కడ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత లా అండ్ ఆర్డర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.. తప్పు చేసే వారికి సైతం తాట తీయడమే కాకుండా బుల్డోజర్లతో బుద్ధి చెప్పేవారు యోగి ఆధిత్యనాథ్ . యోగి సీఎం అయిన తర్వాత అక్కడ రాష్ట్రంలో నేరాలు కూడా చాలా తగ్గిపోయాయి.