
కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...బర్డ్స్ ఫ్లూ విజృంభన విపరీతంగా నెలకొంది. ఈ భయంకరమైన వ్యాధి కారణంగా లక్షల్లో కోళ్లు మరణించాయి. ఈ దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కూడా ఏపీలో దారుణంగా పడిపోయింది. చాలామంది వ్యాపారస్తులు నష్టపోయారు. బర్డ్స్ ఫ్లూ విజృంభించిన నేపథ్యంలో చికెన్ తినేందుకు ఎవరు ముందుకు రాలేదు. చికెన్ ఉచితంగా ఇచ్చిన కూడా ఎవరు తినలేని పరిస్థితి నెలకొంది.
అయితే గత 15 రోజులుగా... ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో చికెన్ కొనుగోలు విపరీతంగా పెరిగాయి. మొన్న రంజాన్ పండుగ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా.. 280 రూపాయలు కిలో ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేశారు జనాలు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలో తొలి బర్డ్స్ ఫ్లూ మరణం సంభవించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటకు సంబంధించిన ఓ చిన్నారికి బర్డ్స్ ఫ్లూ వచ్చినట్లు భారత పరిశోధన వైద్య మండలి నిర్ధారణ చేసింది.
ఇక బర్డ్స్ ఫ్లూ... కారణంగా పల్నాడు జిల్లాకు సంబంధించిన చిన్నారి మరణించినట్లు కూడా అధికారులు చెప్పారు. మార్చి 16వ తేదీన ఈ చిన్నారి మరణించింది. అయితే పచ్చికోడి మాంసం తినడం వల్ల చిన్నారికి..బర్డ్స్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జనాలంతా భయపడిపోతున్నారు . ఎండాకాలం కూడా ఈ రోగం విజృంభిస్తున్న నేపథ్యంలో చికెన్ కొనుగోలు చేసేందుకు భయపడిపోతున్నారు.