ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగులకు కీలకమైన బాధ్యతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పగించడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలకు పింఛన్ డబ్బులను పంచే విషయంలో వీరికే బాధ్యతలను అప్పగించగా అప్పటినుంచి చాలామంది డబ్బులను తీసుకొని పరారవుతూ ఉన్నారు. ఇటీవలే కాలంలో అలా రెండు మూడు సంఘటనలు ఏపీ అంతటా కూడా వినిపించాయి. ఇప్పుడు తాజాగా సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ పించిని డబ్బులతో పరారైన ఘటన హాట్ టాపిక్ గా మారుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.



జిల్లాలోని కంచి కచర్లలో పెంచందారులకు ఇవ్వవలసిన 7.55 లక్షల రూపాయలతో అక్కడ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ ఆ డబ్బులతో పరారైనట్లు ఎంపీడీవో లక్ష్మి కుమారి తెలియజేసింది. అక్కడ గత ఆరు నెలలుగా వెల్ఫేర్ అసిస్టెంట్ విధులు సైతం నిర్వహిస్తూ ఉన్నారట. అయితే పెన్షన్ దారులకు ఇవ్వవలసిన డబ్బులు సైతం తమ కార్యాలయానికి తీసుకువెళ్లి నిన్నటి రోజున ఉదయం పెన్షన్ దారులకు డబ్బు ఇవ్వాల్సి ఉన్న సమయంలో ఇవ్వకపోవడంతో ఎంపీడీవోకి అనుమానం వచ్చి మరి ఆ వెల్ఫేర్ అసిస్టెంట్ కి ఫోన్ చేసిందట.


అయితే ఆ సచివాలయ ఉద్యోగి స్పందించకపోవడంతో డబ్బులతో పరారై ఉంటారని భావించి మరి పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. తరుణ్ కుమార్ పైన చెట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సైతం అధికారులకు సిఫార్సు చేస్తున్నామంటూ ఎంపీడీవో తెలియజేశారు. అయితే ఇలాంటి సంఘటన జరగడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ పాల్పడి ఒక సచివాలయ ఉద్యోగి ఇలా పించిని  సొమ్ముతోనే  పరారయ్యి మరి ఆ డబ్బులను తాను తిరిగి కడతానని కొంతమేరకు సమయం ఇవ్వాలి అంటూ మంత్రి నారా లోకేష్ ని సైతం కోరారు. గతంలో కూడా వాలంటరీలు కూడా ఇలా డబ్బులతో పరారయ్యిన సంఘటనలు చాలానే విన్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: