వైసీపీలో కీలకంగా ఉన్న vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి  ఈ ఏడాది జనవరి 25న వైసిపి పార్టీకి రాజీనామా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానంటూ తెలియజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను ప్రస్తుతానికి ఏ పార్టీలో కూడా లేనని భవిష్యత్తులో కూడా ఏ పార్టీలో ఉండనట్టు కూడా తెలియజేశారు. కానీ బిజెపి పార్టీలోకి చేరుతారనే విధంగా గత కొద్ది రోజుల నుంచి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. విజయసాయి రెడ్డికి బిజెపి పార్టీలో చాలామంది అగ్రనేతలతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.


కానీ తాజాగా బీజేపీ పార్టీలో చేరేందుకు విజయ సాయి రెడ్డి సిద్ధంగా ఉన్నారని ఈ నెలలోనే పార్టీలోకి చేరే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీలో చేరకపోవడంతో చాలా అవకాశాలు చేజారుతున్నాయని.. అందుకే త్వరగా చేరితే రాజకీయ ప్రయోజనాలను అందుకోవచ్చని విజయసాయిరెడ్డి డిసైడ్ అయినట్లుగా పలు రకాల చానల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో రాజ్యసభ స్థానం ఖాళీ అవ్వడంతో ఏప్రిల్ నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.


అందుకే ఇదే సరైన సమయమని విజయ సాయి రెడ్డి భావించి ఈ సమయంలోనే బిజెపిలోకి చేరి రాజ్యసభ సీటును అందుకునేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారని సమాచారం. గత కొంతకాలంగా కాకినాడ సిపోర్టు కేసులో అక్రమంగా వాటాలను బదిలీ చేశారనే ఆరోపణలు కూడా విజయసాయిరెడ్డి పైన వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన మంగళగిరి సీఐడీ పోలీసులు సైతం ప్రశ్నించడం జరిగింది. ఇందులో ఎవరెవరి పాత్రలు ఎంత ఉన్నాయనే విషయం పైన కూడా vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి నుంచి సిఐడి అధికారులు దానాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి విజయ్ సాయి రెడ్డి బిజెపి పార్టీలోకి చేరితే ఖచ్చితంగా పార్టీ బలం మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: