గత కొన్నేళ్లుగా చాలామంది టీడీపీ సీనియర్ లీడర్లలే కాకుండా చాలామంది కార్యకర్తలు కూడా చంద్రబాబు తర్వాత నారా లోకేష్ ని సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. అలా ఇప్పటికే ఎంతోమందిని నేతలు తమ అభిప్రాయాన్ని తెలియజేసినప్పటికీ ఇప్పుడు తాజాగా మరొకసారి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కూడా పలు విషయాలను మాట్లాడడం జరిగింది. తమ నియోజకవర్గంలో రిలయన్స్ బయో గ్యాస్ తయారు చేయడానికి శంకుస్థాపన చేసినటువంటి నారా లోకేష్ పైన ప్రశంసలు కురిపిస్తూ తమ నియోజకవర్గానికి లోకేష్ రావడం చాలా ఆనందంగా ఉందంటూ తెలియజేశారు.


అంతేకాకుండా రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా నారా లోకేష్ ని ప్రకటించి మరొకసారి కూటమిలో చిచ్చు రేపేలా కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి విషయాలపై మాట్లాడవద్దని చెప్పినప్పటికీ కూడా చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు తమకు పేరు రావాలనే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 వేల కోట్ల రూపాయలతో సిబిజె ప్లాంట్ ను సైతం ఏర్పాటు చేయబోతున్నారు రిలయన్స్ ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని తెలుపుతున్నారు.



ఈ బయో గ్యాస్ ప్లాంట్లకు సైతం పనికిరాని భూములను ఉపయోగిస్తున్నామని రైతులకు నిరుపయోగంగా ఉన్న భూములను సైతం తీసుకొని మరి ఏడాదికి 32 వేల రూపాయలు లీజు చెల్లించే విధంగా రిలయన్స్ అగ్రిమెంట్ చేసుకుందంటూ తెలియజేశారు. ఇలాంటి ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ అడగకుండానే చొరవ తీసుకొని మరి తమ నియోజకవర్గానికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందంటూ కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కూడా తెలిపారు.. మరో 10 ఏళ్లపాటు సీఎం చంద్రబాబు గానే ఉండాలని కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ప్రకటించినప్పటికీ అందుకు విరుద్ధంగా మాత్రం టిడిపి నేతలు లోకేష్ పేరును తీసుకువస్తున్నారు. ఈ విషయం పైన అటు జన సైనికులు కూడా మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: