టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మరి కొంతమంది నటన ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఎదగలేకపోతున్నారు. అలాంటి వారిలో నటి పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఈ చిన్నది తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆర్ఎక్స్100 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న పాయల్ ఆ సినిమా అనంతరం వరుసగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.


ఈ మధ్యకాలంలో మంగళవారం సినిమాతో ఒక మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమా అనంతరం ఏవో కొన్ని సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది.

తాజాగా నటి పాయల్ రాజ్ పుత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ను నెపోటిజం, ఫేవరెటిజం తొక్కేస్తున్నాయని పాయల్ అన్నారు. అవకాశాలు చేజారిపోయిన సమయంలో ప్రముఖుల వారసులకు ఆ అవకాశాలు వెళ్ళినప్పుడు నా టాలెంట్, అందం సరిపోడం లేదా అనే సందేహం కలుగుతుంది అంటూ నటి పాయల్ తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసింది.

అంతేకాకుండా #struggleisreal అని హాష్ ట్యాగ్ కూడా జత చేశారు. మరి పాయల్ షేర్ చేసిన ఈ విషయంపై సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం నటి పాయల్ "వెంకటలచ్చిమి"సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తొందర్లోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని పాయల్ అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: