
ప్రవీణ్ పగడాల... మృ తి పట్ల తప్పుడు వార్తలు రాయకండి.. దర్యాప్తుని తప్పుదోవ పట్టించేలా ఎవరు చేయకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇది ప్రవీణ్ ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రవీణ్ పగడాల మరణం పై కొంతమంది యూట్యూబర్లు అలాగే బ్లాగర్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని పాస్టర్ ప్రవీణ్ తమ్ముడు కిరణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన సోదరుడు ప్రవీణ్ మరణాన్ని కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని కూడా మండిపడ్డారు. ఇలాంటివి ఆపేయాలని... మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు. ప్రవీణ్ పగడాల మరణం పై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని కాబట్టి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఇలాంటి సమయంలో అందరూ సంయమనం పాటించాలని వెల్లడించారు.