ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన మాజీ మంత్రి వైసిపి మహిళా నేత ఆర్కే రోజా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ తమ కుటుంబాలను మాత్రమే బంగారమయం చేసుకొనేలా కనిపిస్తున్నారు.పేద ప్రజలకు చేసేదేమీ లేదు అంటూ ఫైర్ అవుతోంది. చంద్రబాబు మీటింగ్లకు వచ్చిన జనాలు మధ్యలోనే పోతున్నారని.. పవన్ కళ్యాణ్ ఎక్కడ నిద్రపోతున్నారో అర్థం కావడం లేదు అంటూ రోజా ఎద్దేవా చేయడం జరిగింది. మొన్న వీళ్ళు వేసిన వెకిలి డాన్సులకు సైతం పడి పడి నవ్వారు.. కానీ తిరుమలలో విచ్చలవిడిగా మధ్యమ అమ్ముతున్నారని ఆ సనాతన యోధుడు ప్రశ్నించరా అంటూ ఫైర్ అయ్యింది.



అలాగే వక్స్ బిల్లు పైన కూడా మీరు చేసిన ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింలు చూస్తున్నారని అసలు బిజెపికి భయపడి పవన్ కళ్యాణ్ ఎక్కడ ముస్లింల విందులో కూడా పాల్గొనలేదని తెలిపారు. వైసీపీలో ప్రశ్నించే వారందరినీ కూడా అక్రమ కేసులు పెడుతున్నారు రాబోయే రోజుల్లో వాళ్ళ నేతలు కూడా అలాంటివి చూస్తారంటు హెచ్చరించింది రోజా. ఆడుదాం ఆంధ్రా వంటి వాటిలో అంతా కూడా పారదర్శకంగానే జరిగింది.. బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడుతూ ఉన్నారు అంటూ ఫైర్ అయ్యింది.


ఇక బలమైన నాయకత్వాన్ని తొక్కడానికి ఇలా అరెస్టులు కేసులు చేస్తూ ఉన్నారని తెలియజేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తారనే భయంతోనే ఇలా మాజీ మంత్రులను అరెస్టు చేస్తున్నారంటూ రోజా వెల్లడించింది. తప్పు చేసినట్టు ఆధారాలు ఉంటే కచ్చితంగా కేసులు వేయండి మీరు ఎన్ని కేసులు వేసినా కూడా వాటన్నిటిని ఎదుర్కొంటాము.. కానీ అక్రమ కేసులు పెడితే మాత్రం సహించమంటూ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు 70 మంది మహిళల పైన అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని అసెంబ్లీలోని మీ కూటమినేతలే ఒప్పుకున్నారు అంటూ ఫైర్ అయ్యింది. ఆంధ్రాలో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా వచ్చేలా చేశారంటూ ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: