
ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను... కూటమి పార్టీలు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్లను వైసిపి పార్టీ నుంచి బయటికి తీసుకురావడం.. ఒకవేళ వాళ్ళు రాకపోతే కేసులు పెట్టడం లాంటివి చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి బడా నేతలు... వైసీపీ కండువా మార్చేశారు. మరి కొంత మంది కూడా టిడిపి పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
అయితే...వైయస్ జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ లో ఉన్న విజయసాయిరెడ్డి కూడా బయటకు వెళ్లారు. అంటే రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి... తాను వ్యవసాయం చేసుకుంటానని కూడా ప్రకటించాడు. ఇలాంటి నేపథ్యంలోనే... వైసిపి పార్టీ అలాగే రాజ్యసభ పదవికి రాజీనామా చేసి... బయటకు వెళ్లారు. వైసీపీ పార్టీ ని వీడిన తర్వాత... వైయస్ జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ చాలా వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.
వైసిపి పార్టీలో ఉన్న నేతలు బయటికి వెళ్లేలా ఆయన కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆయన.. బిజెపి పార్టీ లోకి వెళ్ళబోతున్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయనకు త్వరలోనే రాజ్యసభ పదవి ఇస్తారని చెబుతున్నారు. బిజెపి పార్టీ నేతలు చెప్పినట్లు విజయసాయిరెడ్డి ఇక్కడ మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దీనికోసం బిజెపి ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వబోతుందని కూడా చెబుతున్నారు కొంత మంది రాజకీయ విశ్లేషకులు.