రెండు తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి ఇంటర్ బోర్డు పరీక్షలు సైతం ఇటీవలే ప్రశాంతంగా ముగిస్తాయి. ముఖ్యంగా పరీక్ష సమాధాన పత్రాలు మూల్యాంకనం కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది.ఇలాంటి నేపథ్యంలోనే విద్యార్థులకు సంబంధించి ఫలితాలు ఎప్పుడు వస్తాయని విషయం పైన అటు రెండు తెలుగు రాష్ట్రాలలోని టెన్త్, ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల సైతం తెలియజేశారు. పరీక్షలు సైతం ఈ డేట్ లలో విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలియజేశారు.


ఆంధ్రప్రదేశ్లోని పదవ తరగతి పరీక్షలు అయితే మార్చి 17 నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు పూర్తి అయ్యాయి. ఏప్రిల్ మూడవ తేదీ నుంచి మూల్యాంకనం సైతం ప్రారంభించబోతున్నారట.. దీంతో ఈనెల చివరి వారంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలవుతాయట. లేకపోతే మే మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈసారి వాట్సాప్ నెంబర్ 9552300009 నెంబర్ ద్వారా ఆయన ఫలితాలు తెలుసుకోవచ్చు.


ఇక తెలంగాణ విషయానికి వస్తే మార్చి 21 నుంచి మొదలై ఏప్రిల్ 4న పూర్తి కాబోతున్నాయి. ఇక ఇక్కడ కూడా ఈ నెల ఆఖరి లోపు ఫలితాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.


ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విషయానికి వస్తే ఏప్రిల్ 12 లేదా 15వ తేదీ మధ్య ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ మధ్యలోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. వాట్సాప్ నెంబర్ 9552300009 నెంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.


తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఐదున మొదలయి 25వ తేదీకి పూర్తి అయ్యాయి. ఏప్రిల్ చివరి వారంలోని అక్కడ ఫలితాలను విడుదల చేసేలా విద్యా శాఖ మండలి అధికారులు ప్లాన్ చేస్తున్నారట.

మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో అటు పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రెండు మూడు తేదీల గ్యాప్ లోనే రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: