
వక్ఫ్ బోర్డు గురించి సుమారుగా ఎనిమిది గంటలు చర్చలు ఈరోజు జరిపినప్పటికీ ఎట్టకేలకు ఈ బిల్లును సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం పాస్ చేసింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు కు సంబంధించి ఒక పెద్ద అడుగు సైతం వేసినట్టు కనిపించింది. ఈ బిల్లు ఆమోదం తెలపడంతో వక్ఫ్ బోర్డు ఇకపై ఏ ఆస్తిని వక్ఫ్ కింద ప్రకటించలేరు..వక్ఫ్ అనే పదం ఒక అరబిక్ పదం అల్లాహ్ మరియు ఇస్లాం పేరిట ప్రయోజనాల కోసమే
వక్ఫ్ అనే పదాన్ని ఉపయోగిస్తారట. ఇది వాటి యొక్క ప్రయోజనాల కోసం దానం చేసిన ఆస్తిని పిలుస్తూ ఉంటారట.
స్థిరా మరియు కదిలే ఆస్తులు రెండు కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోకి తీసుకురావచ్చట. భారతదేశంలో వక్ఫ్ బోర్డు సుమారుగా 30 వరకు ఉన్నాయట.. జవహర్లాల్ నెహ్రూ 1954లో ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురాగా 1995లో ఈ చట్టాన్ని సవరించారు. ఆ తర్వాత ఇది ప్రతి రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ప్రత్యేకించి బోర్డులను కూడా ఏర్పాటు చేస్తూ అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
2009 వరకు వక్ఫ్ బోర్డు వద్ద నాలుగు లక్షల ఎకరాలు భూమి ఉన్నదట.. అయితే 2023లో మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు తెలిపిన సమాచారం మేరకు డిసెంబర్ 2022లో మొత్తం మీద 8 లక్షలకు పైగా స్థిరాస్తులు ఉన్నట్లు తెలియజేశారు. అయితే ఇది వారి యొక్క మసీదులు, ఆశ్రమాలు, స్మశానవాటికలు ఉన్నాయట. కానీ దేశంలో ఉండే చేర్చులు ,రైల్వేలు తర్వాత దేశంలోనే అతిపెద్ద భూ యజమానిగా వక్ఫ్ బోర్డు ఉన్నదని అధికారులు తెలియజేశారు.
వక్ఫ్ బోర్డు ఒకసారి ఏదైనా ఆస్తిని తీసుకున్నట్లు అయితే వీటి పైన దర్యాప్తు చేసే హక్కు ఎవరికీ ఉండదట. అందుకే కేంద్ర ప్రభుత్వం వీటిని సవరణ చేయడానికి సిద్ధమయ్యింది.