
అయితే.. అనుకున్నంత తేలికగా.. కేంద్రాన్ని ఢీ కొట్టి వైసీపీ ఈ విషయంలో పార్లమెంటు రాజకీయాలు చేయగలుగుతుందా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ప్రస్తుతం ఏపీలో వైసీపీని సమర్థించే పార్టీలు లేవు. మరోవైపు.. కేంద్రంలో పరోక్షంగా బీజేపీ సమర్థిస్తున్న సమయంలో ఇప్పుడు కావాలని ఆ పార్టీని కూడా దూరం చేసుకుంటుందా? అనేది ప్రశ్న. కాబట్టి.. వైసీపీ ఈ విషయంలో యూటర్న్ తీసుకునేందుకు మెజారిటీ అవకాశం ఉంటుందన్నది అంచనా.
ఏం చేస్తారు..!
వక్ఫ్ బోర్డు బిల్లుపై బుధవారం చర్చ జరిగిన నేపథ్యంలో పార్లమెంటు ఎంపీలకు అన్ని పార్టీలు.. దాదాపు విప్ జారీ చేశాయి. జనసేన, టీడీపీలు కూడా.. తమ తమ ఎంపీలకు విప్ జారీ చేయడం గమ నార్హం.కానీ, వైసీపీ విషయానికి వస్తే.. ఎలాంటి విప్ జారీ చేయలేదు. పైగా.. బిల్లును వ్యతిరేకిస్తున్న కూట మిలోనూ వైసీపీ లేదు. ప్రస్తుతం వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ పార్టీ సహా.. ఇతర ప్రాంతీయ పార్టీలు... బీజేపీయే తర పార్టీలు కూడా.. వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలతో కలిసి పార్లమెంటులో వైసీపీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాల్సి ఉంటుంది.
కానీ, ఇక్కడే వైసీపీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. సభలో చర్చలో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ.. చివరి నిముషంలో ముఖ్యంగా ఓటింగ్ సమయంలో వైసీపీ పార్లమెంటు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తద్వారా.. పార్లమెంటులో మైనారిటీలకు వ్యతిరేకంగా పోరాడామన్న క్రెడిట్‌ను సొంతం చేసుకోవడంతోపాటు.. వాకౌట్ చేయడం ద్వారా.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ప్రకటించామన్న.. క్రెడిట్‌ను కూడా సొంతం చేసుకునే యోచనలో ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే.. ఇది ఆ పార్టీ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని చాటుతుంది. మరి ఏం చేస్తుందో చూడాలి.