
చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడినట్లు.. అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ మహా నగరం లోని ప్రతిష్టాత్మక కట్టడం చార్మినార్. అలాంటి చార్మినార్ నుంచి భారీ వర్షం కారణంగా పెచ్చులు ఊడి పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అధికారులు కూడా నిర్ధారించారని చెబుతున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం వైపు మినార్ నుంచి పెచ్చులు ఊడి.. ఒకసారి గా కింద పడ్డాయట. దీం తో.. అక్కడ షాపింగ్ చేస్తున్న ప్రయాణికులు పరుగులు పెట్టినట్లు చెబుతున్నారు.
ఇక ఈ సంఘటన తెలియగానే... సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు అలాగే అధికారులు చేరుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలిస్తున్నారు అధికారులు. గతంలో కూడా పెచ్చులు ఊడితే అధికారులు మరమ్మత్తులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మరమ్మత్తులు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికి కూడా చార్మినార్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. కాబట్టి వర్షం ఆగిపోయిన తర్వాత.. మరమ్మత్తుల పనులు చేపట్టే ఛాన్సులు ఉన్నాయి.
ఇవాళ అర్ధరాత్రి కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు అధికారులు. అత్యవసరం అయితే తప్పితే బయటికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. కాగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్ పేట, మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్ మహానగరం మొత్తం ఒక్కసారిగా చల్లబడింది.