
పార్టీలో ఎటువంటి ఫిలాసఫీ ఉన్నప్పటికీ.. జనాలను ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సరికొత్త పందాను అలవాటు చేసుకుంటూ ఉండాలి. రాజకీయాలలో ఎంత ఎక్కువగా కలిస్తే అంత పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది.అలాగే పార్టీ క్యాడర్ను ఎంతలా చేరదీస్తే.. అంతకంటే ఎక్కువగా నాయకుడు ఎలివెట్ అవుతారు ఈ విషయం. జగన్ కి తెలిసినప్పుడు కూడా 2019 నుంచి 24 మధ్య తన చుట్టూ ఒక పరదా వేసుకొని ఉండిపోయారని చర్చ కూడా జరిగింది.2024 ఎన్నికలలో కసిగా నేతలు పని చేయలేదని ఫలితంగా ఘోరమైన ఓటమి చవిచూసిందనే విధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు.
దీంతో ఇకమీదట అంతా కార్యకర్తలే అంటూ ఈ మధ్యకాలం చాలా ఎక్కువగా చెబుతూ ఉన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాలనలో ఎక్కువగా కార్యకర్తలకు ప్రిఫరెన్స్ ఉంటుందని.. ఇటీవలే తాడేపల్లి లో జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ విధంగానే అందగిచ్చారట జగన్మోహన్ రెడ్డి. జగన్ 2.O చూస్తారని.. క్యాడర్ కి కూడా ఆసక్తిగా కల్పించేలా వ్యాఖ్యలు చేశారని విధంగా తెలుస్తోంది. కరోనా సమయంలో పాలన కొనసాగించడం వల్ల తాను పార్టీలో ఎవరిని కూడా కలుసుకోలేకపోయానని కార్యకర్తలను కూడా కలవలేకపోయానని తెలిపారు. కానీ 2029లో అవకాశం వస్తే మాత్రం క్యాడర్ రూపురేఖలనే మారుస్తానని తెలియజేశారు. ఇటీవలే జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో 50 స్థానాలకు గాను 39 స్థానాలలో వైసీపీ గేలవడం అంటే అది సామాన్య విషయం కాదని ఇలా గెలిపించిన వారందరికీ కూడా హ్యాట్సాఫ్ అంటూ తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో జగన్ 2.O ఉంటుందంటూ తెలిపారు. మరి 2029లో గెలిస్తే ఏ విధంగా ఉంటుందొ చూడాలి.