
అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసిన వల్లభనేని వంశీ దీనిపైన విచారణ జరిపిన తర్వాత బెయిల్ ఇస్తామంటూ కోర్టు తెలియజేసింది. అయితే ఇటీవలే గడిచిన కొన్ని గంటలకు ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇవే కాకుండా మరికొన్ని కేసులలో కూడా వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వంశి బెయిల్ పిటిషన్ పైన ఈరోజు రేపు తీర్పు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది విజయవాడ జిల్లా కోర్టు.
వల్లభనేని వంశీ ఆత్మకూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని కేసు కూడా నమోదయిందట. ఈ కేసులో కూడా బెయిల్ ఇవ్వాలంటూ వంశీ పైన పిటిషన్ వేయగా పూర్తి విచారణ కాదా ఈరోజు తీర్పు ఇవ్వబోతున్నదట ఆ జిల్లా కోర్టు. అలాగే గన్నవరం టిడిపి కార్యాలయం పై జరిగినటువంటి దాడి కేసులో కూడా ఈ అనే మొదటి ముద్దాయిగా ఈయన అనుచరుడు రంగ ఉన్నారని రెండు రోజులకు ఇప్పటికీ కస్టడీ పూర్తి అయ్యింది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలా టిడిపి కార్యాలయం పై దాడి వెనుక ఉన్న పాత్రలో ఎవరెవరు ఉన్నారని సిఐడి అధికారులు కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన రంగ మాత్రం తనకు ఏం తెలియదంటూ సమాధానాలు ఇస్తున్నారట.