
ఇలాంటి నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గంలో... పొలిటికల్ హీట్ నెలకొంది. వైసిపి కార్యకర్త ఆ నియోజకవర్గంలో హత్యకు గురయ్యాడు. దీంతో రాప్తాడు నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే రంగంలోకి పరిటాల రవి భార్య పరిటాల సునీత దిగారు. ఆమె తాజాగా ప్రెస్ మీట్ పెట్టి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత. పరిటాల రవి హత్య కేసులో జగన్ పాత్ర ఉందని ఆమె బాంబు పేల్చారు. వాస్తవానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం పాపిరెడ్డి పల్లి లో వైసీపీ కార్యకర్త తాజాగా హత్యకు గురయ్యాడు. దీంతో ఆ నియోజకవర్గంలో టిడిపి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. అయితే వైసీపీ కార్యకర్త హత్యపై.. రాప్తాడు వైసిపి పార్టీ ఇన్చార్జి ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసిపి కార్యకర్తను పరిటాల సునీత సొంత బంధువులే హత్య చేశారని.. ఈ కుట్ర వెనుక పరిటాల కుటుంబం ఉందని బాంబు పేల్చారు ప్రకాష్ రెడ్డి.
అయితే ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే పరిటాల సునీత. వ్యక్తిగత కక్షలతో జరిగిన ఈ హత్యను రాజకీయం చేయాలని వైసిపి నేతలు కుట్రలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎంపీపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ హత్య జరిగిందని వైసీపీ ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. ఇది వ్యక్తిగత వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని ఆమె స్పష్టం చేశారు. వైసిపి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి టీవి బాంబులు గురించి వ్యాఖ్యలు చేయడం మరోసారి ఆనాటి రక్త చరిత్ర తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పరిటాల రవి హత్యపై కూడా సునీత స్పందించారు. పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని కూడా సునీత సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి.