ఏపీ ప్రజలు పూర్తిస్థాయిలో బెనిఫిట్ పొందుతున్న అద్భుతమైన పథకాలలో ఆరోగ్యశ్రీ ఒకటనే సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయని సమాచారం అందుతోంది. ఏపీ సర్కార్ 3500 కోట్ల రూపాయలు బకాయి పెట్టడంతో హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. సర్కారు నుంచి బిల్లులు సకాలంలో రావడం లేదని సమాచారం అందుతోంది.
 
మందులు, ఇతర సామాగ్రి సరఫరాదారులకు సైతం బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధి చెప్పుకొచ్చారు. అప్పులపై మందులు అందించలేమని ఇప్పటికే నోటీసులు వచ్చాయని ఓవర్ డ్రాఫ్ట్ దాటిపోవడం వల్ల బ్యాంకులు సైతం అప్పులు ఇచ్చే పరిస్థితి అయితే లేదని తెలుస్తోంది. ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని వాళ్లు వెల్లడిస్తున్నారు.
 
నెలకు ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని తెలుస్తోంది. వైద్యులు, సిబ్బందికి సైతం యాజమాన్యాలు రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని భోగట్టా. ఇప్పటికే ఆస్పత్రులలో నగదు రహిత ఈ.హెచ్.ఎస్ సేవలను నిలిపివేశారని సమాచారం అందుతోంది.
 
ఏపీ సర్కార్ కనీసం 1500 కోట్ల రూపాయలు చెల్లిస్తే తప్ప ఆస్పత్రులలో వైద్య సేవలను అందించే పరిస్థితి అయితే లేదని తెలుస్తోంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరుగుతోందే తప్ప ఆస్పత్రులకు చెల్లించే ప్యాకేజీలు మాత్రం పెరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణల గురించి ఏపీ సర్కార్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతే రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడే ఛాన్స్ అయితే ఉంది. ఏపీలో ఆరోగ్యశ్రీ స్కీమ్ లిమిట్ ను ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కు సంబంధించి కొన్ని మార్పులు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: