ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో రామానాయుడు స్టూడియోకి ఇచ్చినటువంటి భూములపైన తాజాగా పలు రకాల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో రామానాయుడు స్టూడియో ను 2023లో లే అవుట్ కింది 15.17 ఎకరాల భూమిని  కేటాయించారట దీంతో ఏపీ ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తేలుస్తోంది. అయితే కేవలం ఫిలిమ్ స్టూడియో అనుబంధ అవసరాలకు మాత్రమే వీటిని ఉపయోగించాలని 2010లో సురేష్ ప్రొడక్షన్ కు అప్పట్లో టిడిపి పార్టీ 34.44 ఎకరాల భూమిని సైతం కేటాయించారట.


కానీ 2023 మార్చిన 15.17 ఎకరాల భూమిని GVMC నుంచి ప్లాన్స్ అనుమతి పొందినట్లుగా సురేష్ ప్రొడక్షన్స్ తెలియజేసింది.అయితే ఇది కేవలం ఫిలిమ్ స్టూడియో అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సిన భూమిని ఇలా ఇతరుల అవసరాలకు ఉపయోగించడం పైన ప్రభుత్వానికి ఫిర్యాదులు చాలానే వచ్చాయట.  విచారణ చేసిన తర్వాత ఈ భూ వినియోగదాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అనే హక్కు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందంటూ  రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలియజేశారు



ఇలాంటి నిబంధనలో ఉల్లంఘించినందుకు గాను 15.17 ఎకరాల భూమిని సైతం స్వాధీనం చేసుకోబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. మిగిలిన భూమి పైన కూడా పలు రకాల కఠినమైన నియంత్రణ ఉంటుంది అంటూ నోటీసులో కూడా స్పష్టం చేసి ఒక నోట్ ని పంపించారట. ఈ వ్యవహారం పైన సురేష్ ప్రొడక్షన్ కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసే విధంగా అక్కడ జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారట. VMRDC,GVMC కమిషనర్ల భూస్వామికి సైతం మార్పుకు అసలు అంగీకరించకూడదని అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలంటూ అక్కడ జిల్లా కలెక్టర్ కి కూడా పలు రకాల నివేదికలను రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనటువంటి కార్యదర్శి సిసోడియా తెలియజేశారు. మరి మొత్తానికి రామానాయుడు స్టూడియో సంబంధించి ల్యాండ్ ని తిరిగి ఏపీ ప్రభుత్వం తీసుకోవడంతో రామానాయుడు కుటుంబానికి కొంతమేరకు షాక్ తగిలిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: