ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతిసారి కూడా ఎంతో ఆసక్తిని పెంచేలా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ చాలామంది అభిమానులు ఎక్కువగా జగన్ vs పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారని 100% విజయం సాధించామంటూ కూటమి ప్రభుత్వం గెలవగానే ప్రకటించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పవన్ vs జగన్ అన్నట్లుగానే ఎన్నోసార్లు యుద్ధం కూడా కొనసాగుతూ ఉన్నది. ఇలాంటి సమయంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రశ్న పైన సమాధానాన్ని తెలిపారు.


ఇటీవలే కాలంలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అన్నారని.. అయితే జగన్, పవన్ కళ్యాణ్ లో ఎవరు ఎక్కువ అనే ప్రశ్న ఉండవల్లిని ప్రశ్నించగా?.. అందుకు సమాధానంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. ఆయన సొంతంగా ఆ స్థాయికి అయితే చేరుకోలేదని చంద్రబాబు నాయుడు సపోర్టుతోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని ఏపీలో మాత్రం ఎప్పుడూ కూడా చంద్రబాబుvs జగన్ అనే విధంగానే పొలిటికల్ ఉంటాయని తెలిపారు.


అసలు పవన్ కళ్యాణ్ కు జగన్ తో పోలికే లేదని తెలియజేశారు.పోటీ అనేది కూడా ఎప్పుడు చంద్రబాబు, జగన్ మధ్య ఉంటుంది తప్ప మూడో పార్టీ వచ్చే అవకాశం కూడా ఉండదని తెలియజేశారు. జగన్, చంద్రబాబు ఓటు బ్యాంకు మాత్రం ఫిక్స్ అయిందని ఇద్దరికీ అటు ఇటు రెండు శాతం తేడాతో షేరింగ్ ఉండొచ్చు అంటు తెలిపారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎంపికైనప్పటి నుంచి ఇప్పటివరకు తాను ఉద్ధరించింది ఏమీ లేదని తన అభిప్రాయంగా వెల్లడించారు మాజీ ఎంపీ ఉండవల్లి.. మరి రాబోయే రోజుల్లో తన పేరు నిలబెట్టుకునేలా ఏదైనా చేస్తారేమో తెలియదంటూ తెలిపారు. మొత్తానికి జగన్ వర్సెస్ చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: