భారత దేశంలో జీఎస్టీ ని 2017 జులై 1st ప్రారంభించారు.. ఇప్పుడు అధికారంలో వున్న నరేంద్ర మోడీ గవర్నమెంట్ జిఎస్టీ ని ఇంట్రడ్యూస్ చేసింది.. జిఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) మూలంగా ఇటు కేంద్రం తో పాటు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరంగా వుంది..పన్ను రూపేనా రాష్ట్రాలకు భారీగా ఆదాయం లభిస్తుంది..భారత దేశం లో పన్నుల ద్వారా అధికంగా ఆదాయాన్ని ఆర్జీస్తున్న రాష్ట్రాల వివరాలు ఇలా వున్నాయి..అత్యధికంగా ఆదాయం పొండుతున్న రాష్ట్రాలలో హైయెస్ట్ మహారాష్ట్ర రాష్ట్రం వుంది..31,534 కోట్ల ఆదాయం పన్ను ద్వారా పొందుతుంది..మా వల్ల మీరు బ్రతుకుతున్నారు అని ఏ మహారాష్ట్ర వాడు గొడవ చేసింది లేదు.. చిక్కంతా వచ్చింది మిగిలిన రాష్ట్రాల ద్వారానే..

 అలాగే దేశం లో పన్ను రూపేణా అత్యధిక ఆదాయం పొందుతున్న రెండవ రాష్ట్రం కర్ణాటక 13400 కోట్ల రూపాయలు..మహారాష్ట్ర తో పోలిస్తే సగం కూడా లేదు.. కానీ కర్ణాటక రెండో స్థానంలో వుంది.. ఆ తరువాత మూడవ స్థానంలో 12095 కోట్లతో గుజరాత్ రాష్ట్రం ఉండగా..11795 కోట్లతో తమిళనాడు నాలుగో స్థానంలో నిలిచింది.. ఆ తరువాత హర్యానా 10648 కోట్లతో ఐదో స్థానం లో నిలవగా..ఉత్తర ప్రదేశ్ 9,956 కోట్ల తో ఆరవ స్టానం..

ఆ తరువాత స్థానంలో 6138 కోట్ల తో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ 5,827 కోట్లు, ఒరిస్సా 5809 కోట్లు, రాజస్థాన్ 5498 కోట్లు, తెలంగాణ 5,401 కోట్లతో 11వ స్థానం లో వుంది.., మద్యప్రదేశ్ 4173, ఆంధ్రప్రదేశ్ 4,033 కోట్ల తో 13 వ స్థానంలో వుంది.. ఆ తరువాత ఛత్తిస్గడ్ 3721 కోట్లు, జార్ఖండ్ 3309 కోట్లు, కేరళ 2809 కోట్లు ఇలాగ త్రిపుర 260 కోట్లు, చంఢీఘర్ 241 కోట్లు, అన్నిటికన్నా తక్కువ ఆదాయం పొందుతున్న రాష్ట్రం లడాఖ్ 44 కోట్లు గా ఉన్నట్లు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

gst