మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైన తర్వాత కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో సైతం పర్యటించారు. ముఖ్యంగా అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్నా క్యాంటీన్ సైతం నాగబాబు ప్రారంభించారు. అయితే అలా ప్రారంభిస్తున్న సమయంలో అటు టిడిపి, జనసేన కార్యకర్తలు మధ్య గట్టి పోటీగా నినాదాలు సైతం వినిపించాయట. నాగబాబు సైతం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్న సమయంలోనే జై వర్మ అంటూ చాలామంది టిడిపి కార్యకర్తలు సైతం నినాదాలు చేయడం జరిగింది. జనసైనికులు కూడా దీంతో జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయట.


పిఠాపురంలో పలు నియోజవర్గాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ తో పాటు ఎమ్మెల్సీ నాగబాబు కూడా పలు రకాల కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇలా పాల్గొంటున్న సమయంలోనే మొదటి రోజు ఇలా చేదు అనుభవం ఎదురవ్వడం జరిగిందంటూ జనసేన కార్యకర్తలు నేతలు తెలియజేస్తున్నారు. ఇక అన్న క్యాంటీన్ దగ్గర వేసిన ఒక ఫ్లెక్సీలో కూడా నాగబాబు ఫోటో లేకపోవడంతో జనసేన కార్యకర్తలు నిరాశతో ఉన్నారు.మరొకవైపు టిడిపి కార్యకర్తలు జై వర్మ అని నినాదాలు కూడా చేయడంతో పాటుగా ఎవరి జెండాలతో వారు కార్యకర్తలు అక్కడ హడావిడిని సృష్టించారట.


ఇక నాగబాబు ప్రారంభోత్సవానికి వచ్చినప్పటికీ కూడా టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అక్కడికి రాలేదు తనకి ఆహ్వానం అందినప్పటికీ కూడా కొన్ని కారణాల చేత అక్కడికి వెళ్లలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నాగబాబు పిఠాపురం కి రావడంతో అక్కడ జనసేన నేతలు భారీగానే స్వాగతం పలికారు.. ఇక కొన్ని కార్యక్రమాలు ముగించుకొని వెళుతున్న తర్వాత నాగబాబు కారు ఎక్కుతూ ఉండగా జై వర్మ వర్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ అక్కడ టిడిపి కార్యకర్తలు సైతం పలు రకాల నినాదాలు చేశారు. అయితే నాగబాబు వీటన్నిటినీ పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: