
జపాన్ ఇప్పుడు జనాభా పడిపోకుండా ఆపాలని బాగా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే జపాన్‌లో పిల్లలు పుట్టే రేటు ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉంది. ఇది ఇప్పుడే కాదు, చాలా ఏళ్లుగా జరుగుతోంది. చాలామంది యంగ్ జంటలు పిల్లలు వద్దనుకుంటున్నారు. కారణం ఏంటంటే డబ్బులు లేకపోవడం, బతకడానికి ఖర్చులు ఎక్కువ అవ్వడం, ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం. ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు, ఉద్యోగాల్లో టార్గెట్లు చంపేస్తున్నాయి. అందుకే చాలామంది పెళ్లి చేసుకున్నా పిల్లల్ని ఇప్పుడే వద్దనుకుంటున్నారు లేదా వాయిదా వేసుకుంటున్నారు.
అందుకే జపాన్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ పెట్టింది. అదేంటంటే వారానికి నాలుగు రోజులే పని. మిగతా రోజులు సెలవు. అంటే ఒక రోజు ఎక్కువ సెలవు వస్తుంది. ఈ ఒక్క రోజు ఎక్కువ సెలవులో జంటలు హాయిగా రెస్ట్ తీసుకుంటారు, రిలాక్స్ అవుతారు, ఒకరితో ఒకరు ప్రేమగా గడుపుతారు. అప్పుడు ఏమైనా పిల్లలు పుడతారేమో అని వాళ్ల ఆశ. జపాన్‌లో ఇప్పుడు దాదాపు తొమ్మిది మిలియన్ ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి తెలుసా? జనాభా తగ్గిపోతే ఎలా ఉంటుందో చూడండి.
ఇంతకుముందు జపాన్ ప్రభుత్వం కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్లకు డబ్బులు ఇచ్చింది, పెళ్లి చేసుకున్న వాళ్లకు గిఫ్టులు ఇచ్చింది, పిల్లల చైల్డ్ కేర్ సెంటర్లను తక్కువ రేటుకు పెట్టింది. కానీ ఏం లాభం లేకపోయింది. అందుకే ఇప్పుడు కొత్తగా ఏం చేసిందంటే పని ఒత్తిడి తగ్గించి, మనుషులకు పర్సనల్ టైం పెంచితే బాగుంటుందని చూస్తోంది. దీనివల్ల ప్రజలు మళ్ళీ బంధాలకు, కుటుంబానికి, పిల్లల్ని పెంచడానికి విలువ ఇస్తారని ఆశిస్తున్నారు.
సింపుల్‌గా చెప్పాలంటే, జపాన్ ప్రభుత్వం ఇప్పుడు జంటలకు ఎక్కువ టైం ఇస్తోంది. ఎందుకంటే దేశంలో పిల్లల సంఖ్య పెరగాలి, దేశ భవిష్యత్తు బాగుండాలి అని వాళ్ల ప్లాన్, చూద్దాం ఏం జరుగుతుందో.